RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో 3 మాత్రమే బెంగళూరులో!
RCB తన మొదటి 8 మ్యాచ్‌లలో 5 హోం గ్రౌండ్‌కు దూరంగా ఆడాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే జట్టు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.
- By Gopichand Published Date - 07:49 PM, Sun - 16 February 25

RCB: ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించారు. తొలి మ్యాచ్ మార్చి 22న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆర్సీబీకి పెద్ద షాక్ తగిలింది.
RCBకి భారీ దెబ్బ!
IPL 2025లో ఆర్సీబీ తన మొదటి 8 మ్యాచ్‌లలో 3 మాత్రమే తన సొంత మైదానంలో అంటే M చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ప్రారంభ దశలో RCB తన సగానికి పైగా మ్యాచ్‌లను హోం గ్రౌండ్‌కు దూరంగా ఆడడం కాస్త షాకిచ్చే విషయమే అని క్రీడా పండితులు అంటున్నారు. నిజానికి ఏ జట్టు అయినా తన సొంత మైదానంలో మ్యాచ్ ఆడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆతిథ్య జట్టుకు పైచేయి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో RCB హోం గ్రౌండ్ నుండి మొదటి 8 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు వేరే గ్రౌండ్స్‌లో ఆడటం మైనస్‌గానే చెప్పొచ్చు.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?
RCB తన మొదటి 8 మ్యాచ్‌లలో 5 హోం గ్రౌండ్‌కు దూరంగా ఆడాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే జట్టు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది సీజన్ మొత్తంలో జట్టుకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంటుంది. మార్చి 22న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న ఆర్సీబీ, మార్చి 28న సీఎస్‌కేతో రెండో మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఆ జట్టు తన మూడో మ్యాచ్‌ని గుజరాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 2న ఆడనుంది. మే 17న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో RCB లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్
ఐపీఎల్ 2025లో రజత్ పాటిదార్‌కు RCB కమాండ్ ఇచ్చింది. జట్టు అతన్ని కొత్త కెప్టెన్‌గా చేసింది. గత కొన్ని సీజన్లుగా RCB తరపున రజత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది కూడా రజత్ తన బ్యాట్‌తో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.
IPL 2025 కోసం RCB జట్టు
- విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, రజత్ పాటిదార్ (కెప్టెన్), యశ్ దయాల్, లియామ్ లివింగ్‌స్టన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిక్ దార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ.