Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ నెట్ పక్కన నిలబడి ఉన్నాడు.
- By Gopichand Published Date - 07:31 PM, Sun - 16 February 25

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియా కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఆదివారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఎడమ మోకాలి గాయానికి గురయ్యాడు.
పంత్‌కు గాయం
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ నెట్ పక్కన నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్ అతని మోకాలికి తగిలింది. దీంతో రిషబ్ పంత్ చాలా బాధ పడ్డాడు. దీంతో పంత్ వెంటనే నేలపై పడుకొబెట్టి వైద్య బృందం చికిత్స అందించింది. మోకాలికి ఐస్ ప్యాక్ వేసినా కూడా వాపు కనిపించింది. ఐస్ పూసిన తర్వాత పంత్ తన కాళ్ళపై నిలబడి కాసేపు కుంటుతూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో అతను మోకాలికి తీవ్రమైన గాయమైన విషయం మనకు తెలిసిందే.
Also Read: Kumbh Mela: మరో రికార్డు సృష్టించిన కుంభమేళా.. ఏ విషయంలో అంటే?
హార్దిక్ పరామర్శ
ఇది జరిగిన వెంటనే హార్దిక్ పాండ్యా పంత్ వద్దకు వెళ్లి అతను బాగున్నాడా? లేదా అని తెలుసుకుని ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత పంత్ ఎడమ మోకాలికి భారీగా బ్యాండేజ్ వేసుకుని అతను దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లాడు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత్ తన మ్యాచ్‌లన్నింటిన్నీ దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు
- రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్, షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.