టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు అస్వస్థత!
ఈ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.
- Author : Gopichand
Date : 03-01-2026 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాను నేడు ప్రకటించాల్సి ఉంది. అయితే దీనికంటే ముందే భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ కారణం చేతనే విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ జట్టు తరపున ఈరోజు జరగాల్సిన మ్యాచ్‌లో ఆయన ఆడలేకపోయారు. ఈ మ్యాచ్ కోసం గిల్ జైపూర్ చేరుకున్నారు. ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవ్వడంతో మైదానంలోకి దిగలేకపోయారు. ఈ వార్తతో టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన పెరిగింది.
శుభ్‌మన్ గిల్‌కు అస్వస్థత
పంజాబ్, సిక్కిం జట్ల మధ్య జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కెప్టెన్‌గా గిల్ ఈ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయారు. అయితే జనవరి 6న గోవాతో జరగనున్న తదుపరి మ్యాచ్ నాటికి గిల్ కోలుకుంటారని పంజాబ్ టీమ్ ఆశిస్తోంది. టీమ్ ఇండియా విషయానికి వస్తే వన్డే సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి ఆయన పూర్తిగా ఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ గత కొంతకాలంగా గాయాల కారణంగా గిల్ వరుసగా మ్యాచ్‌లు ఆడలేకపోవడం గమనార్హం.
Also Read: మావోయిస్టులకు భారీ దెబ్బ: బీజాపూర్ అడవుల్లో 12 మంది మావోలు మృతి
విరుచుకుపడ్డ పంజాబ్ బౌలర్లు
ఈ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి సిక్కిం వెన్ను విరిచారు. సుఖ్దీప్ బాజ్వా, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు తీశారు. గుర్నూర్ బ్రార్ 1 వికెట్ సాధించారు. తక్కువ లక్ష్యం కావడంతో పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌ను సులువుగా గెలుచుకునే దిశగా సాగుతోంది.