IND vs BAN 1st Test: 4 వికెట్లతో బంగ్లాను వణికించిన భూమ్ భూమ్ బుమ్రా
IND vs BAN 1st Test: జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశారు. సిరాజ్ 10-1 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆకాశ్‌దీప్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు
- By Praveen Aluthuru Published Date - 03:53 PM, Fri - 20 September 24

IND vs BAN 1st Test: చెన్నై చెపాక్ లో బౌలర్లు కుమ్మేస్తున్నారు. టీమిండియా బ్యాటర్లు విఫలమైన వేళ అశ్విన్, జడేజా వీరోచిత పోరాటం చేయగా, జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), మహ్మద్ సిరాజ్(Siraj)లు తమ బంతితో బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో భారత్ బంగ్లాదేశ్‌ను 47.1 ఓవర్లలో 149/10కి కుదించింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరే మూడు పదుల స్కోర్ చేశారు. షకీబ్ ఒక్కడే 32 పరుగులు చేయగలిగాడు.
బంగ్లాదేశ్ (Bangladesh) రెండో సెషన్‌లో వికెట్లు కోల్పోవడం కొనసాగించింది. మరో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయి 227 పరుగుల వెనుకంజలో ఉన్నారు. ఇక ఈ టెస్ట్ ఇన్నింగ్స్ ద్వారా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. బుమ్రా 4 వికెట్లు తీసి 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 11 ఓవర్లలో 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశారు. సిరాజ్ 10-1 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆకాశ్‌దీప్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఆర్ అశ్విన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 13 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు, కానీ అతనికి వికెట్ దక్కలేదు.
Also Read: TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం