TTD : తిరుమల లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి విచారం
Acharya Satyendra Das: దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నానని, అలాంటి తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపం అని అన్నారు.
- By Latha Suma Published Date - 03:37 PM, Fri - 20 September 24

Acharya Satyendra Das: రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తిరుమల లడ్డూ వివాదంపై విచారం వ్యక్తం చేశారు. తిరుపతి బాలాజీ అంటే ప్రజలకు ఎంతో భక్తి, నమ్మకం ఉందని, ఈ రోజుల్లో దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నానని, అలాంటి తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపం అని అన్నారు.
Read Also: iPhone 16 Sale: ముంబైలో జోరుగా ఐఫోన్-16 విక్రయాలు
ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడిన రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో చేప నూనె, జంతువుల కొవ్వు తిరుమల లడ్డూల తయారిలో కలిపినట్లు తేలిందని, ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడి అని రామ జన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోపించారు.
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీయడానికి అంతర్జాతీయంగా ఈ కుట్ర జరిగిందా, లేక దేశంలోనే దీనికి భీజం పడిందా అనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇంకోసారి మరెవ్వరు కూడా తిరుమల దేవస్థానంతో, తిరుమల లడ్డూలతో ఆటలు ఆడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామజన్మభూమి ఆలయం పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు.
Read Also: Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
ఎవరైనా తిరుమలలో లడ్డూల పవిత్రను కాపాడటానికి ప్రయత్నిస్తారని, లడ్డూల తయారికి జంతువుల కొవ్వు, చాప నూనె ఉపయోగించడం ఎంతో పాపమని, తప్పు చేసిన వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎటువంటి పరిస్థితులను వదిలిపెట్టరని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు. తిరుమల లడ్డూల తయారిలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీ మహా ప్రసాదమైన లడ్డుల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చాపల నానె వంటివి కలగలిసి ఉండొచ్చని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గత జగన్ ప్రభుత్వం పై దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరా చేసిన వారిపైన అప్పటి టీటీడీ బోర్డు కమిటీపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.