Speed News
-
Raja Singh: బీజేపీ నేతలపై దాడుల వెనుక కేసీఆర్ – రాజా సింగ్
నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో ఎంపీ అరవింద్ ధర్మపురితోపాటు బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు.
Date : 25-01-2022 - 11:06 IST -
Karimnagar: వాక్సినేషన్ లో దేశంలోనే రికార్డ్ సాధించిన కరీంనగర్
వ్యాక్సినేషన్‌లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకున్నది.
Date : 25-01-2022 - 9:58 IST -
Kinnera Mogulaiah: కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు!
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది.
Date : 25-01-2022 - 9:55 IST -
Bandi Sanjay: కేసీఆర్ రజాకార్ లా వ్యవహరిస్తున్నారు!
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి టీఆర్ ఎస్ కార్యకర్తలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నందిపేట్ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్
Date : 25-01-2022 - 5:20 IST -
Fisheries University : ఏపీలో ఫిషరీస్ యూనివర్సిటీ రెడీ
వచ్చే ఏడాది నుంచి నరసాపురం కేంద్రంగా ఫిషరీస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభించడానికి సిద్దం అయింది.
Date : 25-01-2022 - 4:57 IST -
Ashok Babu: అశోక్‌బాబుపై కేసు నమోదు
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవ
Date : 25-01-2022 - 4:18 IST -
Night Curfew in TS : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ కర్ఫ్యూ విధించడంలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Date : 25-01-2022 - 4:17 IST -
Traffic Restrictions : రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
Date : 25-01-2022 - 4:16 IST -
BA Raju: మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీఏ రాజు కుమారుడు!
టాలీవుడ్ లో బెస్ట్ పీఆర్ ఓ ఎవరైనా ఉన్నారంటే.. అది బీఏ రాజు అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో చిత్రాలకు పీఆర్ ఓ గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. అనారోగ్య సమస్యలతో రాజు చనిపోయారు. ఆయన కుమారుడు డైరెక్టర్ శివకుమార్ మారాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో శివకుమార్ పెళ్లి సాదాసీదాగా జరిగింది. దీని
Date : 25-01-2022 - 3:42 IST -
AP Employess: కదం తొక్కిన ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. పలు ప్రభుత్వ కార్యాలయా వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా
Date : 25-01-2022 - 3:29 IST -
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చ
Date : 25-01-2022 - 2:50 IST -
YSR EBC Nestam scheme : అగ్రవర్ణ పేదలకు జగన్ స్కీం
అగ్రవర్ణ పేదలకు YSR EBC నేస్తం పేరుతో మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేరుగా మహిళల ఖాతాలలో నగదును పంపిణీ చేసింది. మహిళల ఖాతాల్లో 589 కోట్లు జమ అయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మొదటి విడతను సీఎం జగన్ ప్రారంభించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో చేర్చనప్పటికీ
Date : 25-01-2022 - 1:57 IST -
Trains Cancelled : ఈ నెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
Date : 25-01-2022 - 1:56 IST -
Mask Violation: మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫైన్ కట్టాల్సిందే!
మాస్క్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులపై చిక్కడపల్లి పోలీసులు సోమవారం సుమారు 100 కేసులు నమోదు చేశారు.
Date : 25-01-2022 - 12:14 IST -
Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ
Date : 25-01-2022 - 11:36 IST -
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వా
Date : 25-01-2022 - 11:30 IST -
Konda: ఆ బుల్లెట్ లకి ముందు కథ, వాటి తర్వాత కథే.. మా ‘కొండా’ కథ!
కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.
Date : 25-01-2022 - 11:22 IST -
New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఫిక్స్..?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Date : 25-01-2022 - 9:59 IST -
Delhi: ఢిల్లీలో చలిపులి.. వణికిపోతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో ప్రజలు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
Date : 25-01-2022 - 9:44 IST -
Covid19: ఏపీలో కరోనా కొత్త కేసులు 14,502
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒకరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీల
Date : 24-01-2022 - 9:59 IST