Telangana: న్యూ ఇయర్ వేడుకలపై హై కోర్టు లో పిటిషన్
- By hashtagu Published Date - 02:37 PM, Wed - 29 December 21

న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు సూచనలకు విరుధంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను ఉల్లంఘించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే, దీనిపై గురువారం విచారణ జరుపుతామని హై కోర్టు పేర్కొంది.