Speed News
-
Textile GST: కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శులు చేశారు. కేంద్రం విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.
Date : 24-12-2021 - 10:17 IST -
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Date : 24-12-2021 - 10:02 IST -
AP Governor : వరద బాధితులకు గవర్నర్ చేయూత
ఏపీలో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తేరుకోలేకపోతున్నారు. కూడు, గూడు, గుడ్డ కుసైతం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన విఛక్షణాధికారాలతో రెడ్‌క్రాస్‌కు రూ.25లక్షల నిధులు సమకూర్చారు. వాటితో వరద బాధితుల సహాయార్థం సామగ్రిని సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన లారీలను శుక్రవారం గవర్నర్ జెండా ఊపి ప
Date : 24-12-2021 - 5:42 IST -
Delhi: ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి
ఢిల్లీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 148.33 లక్షల మంది అర్హత ఉన్న జనాభాకు వ్యాక్సిన్ మొదటి డోసు వేసినట్లు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి , అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇతర అధికారులకు ధన్యవాదాలు చెబుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒమైక్రాన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినీయలేదు. 👏👏Delhi
Date : 24-12-2021 - 5:37 IST -
Alert: ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి.
దేశంలో ఉగ్రకదలికలు పెరుగుతున్న వేళ నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న పంజాబ్ లో జరిగిన లుథియానా బాంబ్ బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు అసలు నిజాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికలు రానుండటంతో మరిన్ని బాంబ్ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు భద్రతా దళాలలను హెచ్చరిస్తూ వస్తోంది. క
Date : 24-12-2021 - 5:15 IST -
Politics: కౌలు రైతు నానాజీది ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్
చెరకు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చెరకు బిల్లులు చెల్లించాలని విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని ఎన్సీఎస్ ఫ్యాక్టరీ ఎదుట రాస్తారోకోకి దిగిన చెరకు రైతుల్ని చావగొట్టిన పోలీసులు… తిరిగి రైతులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 10.65 కోట్ల బకాయిలు చెల్లించాలని
Date : 24-12-2021 - 5:01 IST -
Telangana: టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు!
టికెట్ల విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దూమరం రేగుతోంది. ఒకవైపు హీరోలు, మరోవైపు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్టీగా ధరన
Date : 24-12-2021 - 4:09 IST -
Politics: నా కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటున్నారు: అశోక్ గజపతిరాజు
రామతీర్థం ఘటనలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. తనకు పోలీసులు 41ఏ నోటీసును ఇచ్చారని చెప్పారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థం ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంల
Date : 24-12-2021 - 4:05 IST -
Cricket: క్రికెట్ కి హర్భజన్ సింగ్ గుడ్ బై
అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 41 సంవత్సరాల హర్భజన్ సింగ్ 1998లో న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరగేంట్రం చేశాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులు, 236 ఓడిఐ, 28 టీ ట్వంటీ మ్యాచులు ఇండియా తరపున ఆడాడు. 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచినా టీం లో ప్లేయర్ గా హర్భజన్ ఉన్నారు. ఈ […
Date : 24-12-2021 - 3:23 IST -
CJI: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంతూరికి!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ పై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపు తో మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగి
Date : 24-12-2021 - 2:54 IST -
Uttar Pradesh: ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు షాక్ అయ్యారు. కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా.. ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్
Date : 24-12-2021 - 2:51 IST -
Cinema: జగన్ సార్.. అందరికీ వరాలు ఇస్తారు.. మరి మాకు ఇవ్వరా?
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వివాదంపై సినీనటుడు బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందించారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోలను ఆయన ఈ సందర్భంగా రీట్వీట్ చేశారు. తెలంగాణలో కారు పార్కింగ్ ధరే రూ.30 ఉందని, ఏపీలో మాత్రం బాల్కనీ టికెట్ ధర రూ.20, ఫస్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫొటోలనే బ్రహ్మాజీ పోస్ట్ చేస్తూ.. ‘సీఎం జగన్
Date : 24-12-2021 - 1:24 IST -
Uttarakhand: ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఈ నెల 17 నుంచి19 వరకూ మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో పలు హిందూ సంస్థల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువులంతా ఆయుధాలు చేపట్టి, ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలని సభ పిలుపునిచ్చింది. https://twitter.com/zoo_bear/status/1473581283242491904 సభకు నేతృత్వం వహించిన య
Date : 24-12-2021 - 12:45 IST -
AP CM : ఇడుపులపాయకు చేరుకొని.. తండ్రికి నివాళులర్పించి!
కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మధ్యాహ్నానికి పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడ.. ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టా
Date : 24-12-2021 - 12:34 IST -
TTD: శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని
తిరుమల వేంకటేశ్వరుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. సామాన్యులు మొదలుకొని దేశ ప్రధానుల వరకు వెంకన్న దర్శనం కోసం తపిస్తుంటారు. రెండుమూడు రోజులు తిరుమల బస చేసి స్వామివారి సేవలో తరిస్తుంటారు. తాజాగా శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీ
Date : 24-12-2021 - 12:23 IST -
India: మాతృమూర్తిని, మాతృభాషను గౌరవించండి- ఎన్వీ రమణ
గురువారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ మాట్లాడుతూ.. తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్
Date : 24-12-2021 - 12:21 IST -
Omicron: 358కి పెరిగిన ఓమిక్రాన్ కేసులు!
24 గంటల్లో 6,650 కొత్త కోవిడ్ కేసులు, 374 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం రిపోర్ట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 358కి పెరిగింది. కొత్త మరణాల చేరికతో మొత్తం 4,79,133కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 358కి చేరుకుంది. అయితే, మొత్తం ఓమిక్రాన్ పాజిటివ్‌లో 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు ఓమిక్రా
Date : 24-12-2021 - 12:07 IST -
Bangladesh: నౌకలో 36 మంది సజీవదహనం
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలో జరిగింది. ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు
Date : 24-12-2021 - 12:00 IST -
Cinema: హీరో నానిపై వైసీపీ నేతల ఫైర్
హీరో నానిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హీరో నాని సినిమాలకు తీసుకుంటోన్న పారితోషికం ఎంత? అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పారితోషక
Date : 24-12-2021 - 11:43 IST -
Visa: వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు రద్దు – అమెరికా
కరోనా మహమ్మారిని నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ వీసాల విషయంలో వెసులుబాటును పొడిగించింది. వీసా దరఖాస్తుదారులకు భారత్ లోని స్థానిక కాన్సులేట్లలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని వర్చ్యువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సదుపాయం అమల్లో ఉండగా 2022 డిసెంబర్ 31 వరకు దీనిని పొడిగించినట్టు ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ ఇంటర్వ్యూ విధానంతోనే
Date : 24-12-2021 - 11:02 IST