Amaravati: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- By Balu J Published Date - 11:31 AM, Wed - 29 December 21

నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విధానం రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసి స్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం కమిషన్ నోటిఫి కేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.