TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు..
- By hashtagu Published Date - 03:14 PM, Wed - 29 December 21

నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కానీ ఆయా రోజులలో వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం ఉంటుందన్నారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు సిఫారసు లేఖలతో దర్శనాలకు రాకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేవలం వీఐపీలను అనుమతిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేకమంది సాధారణ భక్తులు స్వామివారి దర్శనానికి తీవ్ర ఇబంధులు పడవలసి వస్తుంది.
వైకుంఠ ద్వార దర్శనానికి నిత్యం 45 వేల మంది భక్తులను అనుమతించే విధంగా ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి చెప్పారు. “వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనాలు మొదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు, వీఐపీలకు బ్రేక్ దర్శనం అనంతరం 9 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది’’ అని ఆయన వివరించారు. భక్తులు ఎవరైనా కానీ కరోనా లక్షణాలు ఉంటే స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.