Speed News
-
Uttarakhand: ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఈ నెల 17 నుంచి19 వరకూ మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో పలు హిందూ సంస్థల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువులంతా ఆయుధాలు చేపట్టి, ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలని సభ పిలుపునిచ్చింది. https://twitter.com/zoo_bear/status/1473581283242491904 సభకు నేతృత్వం వహించిన య
Date : 24-12-2021 - 12:45 IST -
AP CM : ఇడుపులపాయకు చేరుకొని.. తండ్రికి నివాళులర్పించి!
కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మధ్యాహ్నానికి పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడ.. ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టా
Date : 24-12-2021 - 12:34 IST -
TTD: శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని
తిరుమల వేంకటేశ్వరుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. సామాన్యులు మొదలుకొని దేశ ప్రధానుల వరకు వెంకన్న దర్శనం కోసం తపిస్తుంటారు. రెండుమూడు రోజులు తిరుమల బస చేసి స్వామివారి సేవలో తరిస్తుంటారు. తాజాగా శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీ
Date : 24-12-2021 - 12:23 IST -
India: మాతృమూర్తిని, మాతృభాషను గౌరవించండి- ఎన్వీ రమణ
గురువారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ మాట్లాడుతూ.. తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్
Date : 24-12-2021 - 12:21 IST -
Omicron: 358కి పెరిగిన ఓమిక్రాన్ కేసులు!
24 గంటల్లో 6,650 కొత్త కోవిడ్ కేసులు, 374 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం రిపోర్ట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 358కి పెరిగింది. కొత్త మరణాల చేరికతో మొత్తం 4,79,133కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 358కి చేరుకుంది. అయితే, మొత్తం ఓమిక్రాన్ పాజిటివ్‌లో 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు ఓమిక్రా
Date : 24-12-2021 - 12:07 IST -
Bangladesh: నౌకలో 36 మంది సజీవదహనం
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలో జరిగింది. ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు
Date : 24-12-2021 - 12:00 IST -
Cinema: హీరో నానిపై వైసీపీ నేతల ఫైర్
హీరో నానిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. హీరో నాని సినిమాలకు తీసుకుంటోన్న పారితోషికం ఎంత? అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పారితోషక
Date : 24-12-2021 - 11:43 IST -
Visa: వీసాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు రద్దు – అమెరికా
కరోనా మహమ్మారిని నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ వీసాల విషయంలో వెసులుబాటును పొడిగించింది. వీసా దరఖాస్తుదారులకు భారత్ లోని స్థానిక కాన్సులేట్లలో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అవసరం ఉండదని వర్చ్యువల్ గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సదుపాయం అమల్లో ఉండగా 2022 డిసెంబర్ 31 వరకు దీనిని పొడిగించినట్టు ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ ఇంటర్వ్యూ విధానంతోనే
Date : 24-12-2021 - 11:02 IST -
UP: అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో అలహాబాద్ హై కోర్టు ప్రధాని నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా కు పలు సూచనలు చేసింది. డెల్టా వేరియెంట్ కంటే ఓమిక్రాన్ మూడు రేట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వెంటనే ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులను రద్దు చేయాలనీ కోరింది. అవసరమైతే ఫిబ్రవరిలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరింది.
Date : 24-12-2021 - 10:51 IST -
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Date : 23-12-2021 - 11:40 IST -
India: పుల్వామాలో మరో ఉగ్రవాద చర్య .. తిప్పికొట్టిన సైనికులు
పుల్వామాలో మరో తీవ్రవాద చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు. సమాచారం అందుకున్నవెంటనే బాంబును కనిపెట్టి ధ్వంసం చేశారు సైనికులు. పుల్వామాలోని ఓ రోడ్డు పక్కన దాదాపు 5 కిలోల బరువు ఉన్న ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోసివ్ డివైజును(IED) ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. బాంబును కనిపెట్టడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ఎత్తున్న ప్రాణనష్టం వాటిల్లేదని అధికారులు అన్నారు. 2019లోని పుల్వామా చేదు అనుభవాలు
Date : 23-12-2021 - 6:02 IST -
Bhatti Vikramarka : జనవరి 9నుంచి పాదయాత్ర
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న టిఆర్ఎస్ సర్కారు కండ్లు తెరిపించేందుకు జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని తెలంగాణ శాసనసభ పక్షనేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ పాలకుల చీడ నుంచి తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని వెల్ల
Date : 23-12-2021 - 5:53 IST -
UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్
Date : 23-12-2021 - 5:19 IST -
Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.
Date : 23-12-2021 - 4:48 IST -
ఆస్పత్రికి 60ఏళ్ల అంధ ఏనుగు
60ఏళ్ల వయస్సు అంధ ఏనుగును కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మధుర లోని ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ రక్షించి పునరావాసం కల్పించిన ఆ ఏనుగు ప్రస్తుతం అనేక వ్యాధులతో బాధపడుతుంది.
Date : 23-12-2021 - 4:45 IST -
Video : కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్
కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. స్పీకర్ తమ్మినేని కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పీకర్ కు అనారోగ్య సమస్యలు ఉండటంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే తమ్మిన
Date : 23-12-2021 - 4:12 IST -
Andhra pradesh: వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’- జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యాయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడంలేదని వెల్లడించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధుల
Date : 23-12-2021 - 4:12 IST -
Drugs: 26 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత!
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సుమారు 183 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ (ఎక్స్టాసీ) డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ రూ.26,28,000 ఉంటుందని, వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేస
Date : 23-12-2021 - 4:03 IST -
Crime: వీఎన్ఆర్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక
Date : 23-12-2021 - 3:54 IST -
Cinema: ఏపీలో థియేటర్లను సీజ్ చేసిన అధికారులు
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు పై అటు సినిమా ఇండస్ట్రీ కి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో థియేటర్ల యాజమాన్యాలు బలవుతున్నాయి. తాజాగా గురువారం ఏపీలో నిబంధనలు పాటించని పలు థియేటర్లను అధికారుల సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 7, కుప్పంలో 4 థియేటర్లును సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. సీఎం జగన్‌తోనే సినీ
Date : 23-12-2021 - 3:42 IST