HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Supreme Court Say There No Way To Cancel The Policy Once It Is Granted

Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’

  • Author : hashtagu Date : 29-12-2021 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన బాధ్యత పాలసీ తీసుకునే వారిపై ఉంటుంది. అయితే ప్రపోజర్ తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడు. ఒక్కసారి పాలసీ జారీ చేయడం పూర్తయితే.. బీమా సంస్థ ముందు నుంచి ఉన్న సమస్య అంటూ క్లెయిమ్ ను తిరస్కరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

మన్మోహన్ నందా అనే వ్యక్తికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. అమెరికా వెళుతూ ఆయన ఓవర్సీస్‌ మెడిక్లెయిమ్‌ బిజినెస్‌ అండ్‌ హాలిడే పాలసీ తీసుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం చేరుకున్న తర్వాత హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించిన డాక్టర్లు మూడు స్టెంట్లు వేశారు.

నందా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అతడికి ముందునుండే హైపర్ లిపిడేమియా, మధుమేహం సమస్యలు ఉన్నాయని, స్టాటిన్ మాత్రలు వాడుతున్నా కానీ పాలసీ కొనుగోలు చేసే సమయంలో వెల్లడించలేదని బీమా సంస్థ క్లెయిమ్ ను తిరస్కరించింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లోనూ పాలసీదారుకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఉన్నట్టుండి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన నేపథ్యంలో పాలసీదారు రక్షణ కోసమే పాలసీ తీసుకుంటారన్న సూక్ష్మ అంశాన్ని కోర్టు గుర్తు చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • insurence policy
  • Supreme Court Of India

Related News

Drinking Water After Meals

భోజనం చేసిన వెంటనే నీరు తాగడం సరైనదేనా?

భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే భారీగా నీరు తాగడానికి బదులుగా భోజనానికి 30 నిమిషాల ముందు లేదా భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని భావిస్తారు.

  • Death

    మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • Pan

    పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?

  • Heart Attack

    ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

Latest News

  • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

  • Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

  • కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం

  • రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

Trending News

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd