Speed News
-
Ram Pics: న్యూజోష్.. అభిమానులతో హీరో రామ్ సందడి!
రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో రామ్ ఒకరు.
Date : 20-12-2021 - 5:43 IST -
India: గుజరాత్ లో 400కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్ కోస్తా తీరంలో పాకిస్థాన్ కు చెందిన ఓ నావలో 400 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Date : 20-12-2021 - 5:22 IST -
Pawan Kalyan:వైసీపీ ఎంపీలపై మరోసారి జనసేన అధినేత పవన్ ఫైర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపాలని వైసీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 5:17 IST -
Tollywood : స్క్రిప్ట్ వర్క్ లో ‘వీరమల్లు’ బిజీబిజీ
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Date : 20-12-2021 - 5:03 IST -
Sports: రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘనవిజయం
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
Date : 20-12-2021 - 4:29 IST -
India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
Date : 20-12-2021 - 4:04 IST -
Nara Bhuvaneswari: వల్లభనేని వంశికి నారా భువనేశ్వరి కౌంటర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.
Date : 20-12-2021 - 3:54 IST -
Cock Fight: జగన్ గారు.. కోడి పందాలకు అనుమతి ఇవ్వండి!
కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పటివరకు కాపుల సమస్యలపై లేఖలు రాసిన ఆయన ఈ సారి సంకాంత్రికి కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులను లేఖలో ఆయన ప్రస్తావించారు.
Date : 20-12-2021 - 3:50 IST -
Gay Marriage: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్!
తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్ లో శనివారం జరిగిన ప్రైవేట్ వేడుకలో స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని అధికారికంగా చేసుకున్నారు.
Date : 20-12-2021 - 3:43 IST -
Andhra Pradesh: విద్యుత్ కొనుగోలులో అవినీతి – సీపీఐ
సోలార్ విద్యుత్ కొనుగోళ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనిట్ రూ.2.05గా ఉన్న సోలార్ విద్యుత్ ను రూ.2.45 చొప్పున కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సెకీ (ఎస
Date : 20-12-2021 - 3:38 IST -
CJI Ramana: సీజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి వెళ్తున్న ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సొంత ఊరికి వెళ్లనున్నారు.
Date : 20-12-2021 - 3:31 IST -
India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టిన కేంద్రం
ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది.
Date : 20-12-2021 - 2:55 IST -
Srisailam: వైభవంగా మల్లికార్జునుడి వార్షిక ఆరుద్రోత్సవం
ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి వార్షిక ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
Date : 20-12-2021 - 1:22 IST -
Andhra Pradesh: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Date : 20-12-2021 - 1:06 IST -
Rashmika and Vijay : ముంబై వీధుల్లో రష్మిక, విజయ్ చెట్టాపట్టాల్!
ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు తమ సన్నిహితులతో ఓ చిన్న క్యాచ్‌అప్‌ని ఇష్టపడతారు.
Date : 20-12-2021 - 12:55 IST -
Tollywood : ఐటెం బ్యూటీకి బ్రెస్ట్ క్యాన్సర్!
పలు ఐటెం సాంగ్స్ తో కుర్రకారును ఆకట్టుకున్న నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
Date : 20-12-2021 - 12:06 IST -
Panama: పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్యరాయ్ కు ఈడి నోటీసులు
పనామా పేపర్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు ఈడి సమన్లు జారీ చేయగా సోమవారం ఆమె విచారణకు హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Date : 20-12-2021 - 11:48 IST -
Parliament: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ పై మరో మలుపు
రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, శివ సేనలకు చెందిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
Date : 20-12-2021 - 11:15 IST -
Telangana: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసనలు
వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 10:57 IST -
BWF World Championships: కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించాడు
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ గెలుస్తారని తన అభిమానులు ఆశలు పెట్టుకోగా, శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను అడుగుదూరంలో చేజార్చుకున్నాడు.
Date : 19-12-2021 - 11:10 IST