Speed News
-
UP: అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో అలహాబాద్ హై కోర్టు ప్రధాని నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా కు పలు సూచనలు చేసింది. డెల్టా వేరియెంట్ కంటే ఓమిక్రాన్ మూడు రేట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వెంటనే ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులను రద్దు చేయాలనీ కోరింది. అవసరమైతే ఫిబ్రవరిలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరింది.
Date : 24-12-2021 - 10:51 IST -
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Date : 23-12-2021 - 11:40 IST -
India: పుల్వామాలో మరో ఉగ్రవాద చర్య .. తిప్పికొట్టిన సైనికులు
పుల్వామాలో మరో తీవ్రవాద చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు. సమాచారం అందుకున్నవెంటనే బాంబును కనిపెట్టి ధ్వంసం చేశారు సైనికులు. పుల్వామాలోని ఓ రోడ్డు పక్కన దాదాపు 5 కిలోల బరువు ఉన్న ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోసివ్ డివైజును(IED) ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. బాంబును కనిపెట్టడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ఎత్తున్న ప్రాణనష్టం వాటిల్లేదని అధికారులు అన్నారు. 2019లోని పుల్వామా చేదు అనుభవాలు
Date : 23-12-2021 - 6:02 IST -
Bhatti Vikramarka : జనవరి 9నుంచి పాదయాత్ర
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న టిఆర్ఎస్ సర్కారు కండ్లు తెరిపించేందుకు జనవరి 9 నుంచి మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని తెలంగాణ శాసనసభ పక్షనేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ పాలకుల చీడ నుంచి తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి తన పాదయాత్ర మొదలవుతుందని వెల్ల
Date : 23-12-2021 - 5:53 IST -
UP: చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి -అఖిలేశ్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్
Date : 23-12-2021 - 5:19 IST -
Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది.
Date : 23-12-2021 - 4:48 IST -
ఆస్పత్రికి 60ఏళ్ల అంధ ఏనుగు
60ఏళ్ల వయస్సు అంధ ఏనుగును కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మధుర లోని ఎలిఫెంట్ కన్జర్వేషన్ అండ్ కేర్ సెంటర్ రక్షించి పునరావాసం కల్పించిన ఆ ఏనుగు ప్రస్తుతం అనేక వ్యాధులతో బాధపడుతుంది.
Date : 23-12-2021 - 4:45 IST -
Video : కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్
కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు. ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. స్పీకర్ తమ్మినేని కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పీకర్ కు అనారోగ్య సమస్యలు ఉండటంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే తమ్మిన
Date : 23-12-2021 - 4:12 IST -
Andhra pradesh: వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’- జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యాయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడంలేదని వెల్లడించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధుల
Date : 23-12-2021 - 4:12 IST -
Drugs: 26 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత!
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సుమారు 183 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ (ఎక్స్టాసీ) డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ రూ.26,28,000 ఉంటుందని, వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేస
Date : 23-12-2021 - 4:03 IST -
Crime: వీఎన్ఆర్ కళాశాల విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక
Date : 23-12-2021 - 3:54 IST -
Cinema: ఏపీలో థియేటర్లను సీజ్ చేసిన అధికారులు
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు పై అటు సినిమా ఇండస్ట్రీ కి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదంలో థియేటర్ల యాజమాన్యాలు బలవుతున్నాయి. తాజాగా గురువారం ఏపీలో నిబంధనలు పాటించని పలు థియేటర్లను అధికారుల సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో 7, కుప్పంలో 4 థియేటర్లును సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. సీఎం జగన్‌తోనే సినీ
Date : 23-12-2021 - 3:42 IST -
Viral : పిక్ ఆఫ్ ది డే.. ఆ నలుగురు ఓకేచోట!
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ RRR టీమ్ మొత్తం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్, లీడ్ యాక్టర్స్ హైప్ ని కొనసాగించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ వారు రానా దగ్గుబాటిని అతని ముంబై ఫ్లాట్‌లో కలుసుకున్నారు. అతనితో సరదాగా గడి
Date : 23-12-2021 - 3:31 IST -
Thirupathi: శ్రీవారి దర్శనానికి విచ్చేసిన శ్రీలంక ప్రధాని కుటుంబం..
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఈ మధ్యాహ్నం భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం రేపు ఉదయం శ్రీవా
Date : 23-12-2021 - 3:27 IST -
India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్
కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.
Date : 23-12-2021 - 3:10 IST -
India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్
పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల
Date : 23-12-2021 - 2:40 IST -
CBN: రైతుల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది!
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రైతు పడుతున్న కష్టాలు చూస్తుంటే బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దుక్కి దున్నిన నాటి నుండి పంటను అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు రై
Date : 23-12-2021 - 1:30 IST -
Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. ట
Date : 23-12-2021 - 1:18 IST -
India: విచారణకు హాజరైన కంగనా..
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను ఆమె తీవ్రవాదులతో పోల్చారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు కంగనా రనౌత్ ను జనవరి 25 వరకు అరెస్టు చే
Date : 23-12-2021 - 1:05 IST -
Telangana: KCR ఫామ్‌హౌస్‌లో యువకుడి మృతి పట్ల RSP సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. యువకుడి మరణంతో ప్రభుత్వం పై అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోని యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వెంటనే యువకుడి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని
Date : 23-12-2021 - 12:35 IST