AP CM: సీఎం జగన్ ను కలిసిన కిదాంబి శ్రీకాంత్
- Author : Balu J
Date : 29-12-2021 - 3:19 IST
Published By : Hashtagu Telugu Desk
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (BWF World Championships) 2021 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీకాంత్ ప్రదర్శన పట్ల ప్రతిఒక్కరూ గర్వించారు. తాజాగా ఈ భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో రజత పతకం సాధించిన శ్రీ కాంత్ ను అభినందించారు.