Speed News
-
Kashmir: గుప్కార్ నేతల హౌస్ అరెస్ట్
పునర్విభజన కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా గుప్కార్ నేతలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని జమ్ముకశ్మీర్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామిలతో పాటు ఇతర నేతలందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే తమ శాంతియుత నిరసనలను అణచివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
Date : 01-01-2022 - 3:02 IST -
India: రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం.. రూ.20,900 కోట్లు విడుదల
రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను వర్చువల్‌గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హలైన రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అంది
Date : 01-01-2022 - 2:18 IST -
Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు
ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ఫెక్షన్ ను ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకి
Date : 01-01-2022 - 2:06 IST -
Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ
గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు
Date : 01-01-2022 - 1:51 IST -
CBI chargesheet: 947.70 కోట్ల మోసం.. రఘు రామకృష్ణంరాజుపై చార్జిషీట్!
947.70 కోట్ల రుణ మోసానికి పాల్పడినందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్-బారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.
Date : 01-01-2022 - 1:34 IST -
Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఒమైక్రాన్ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలన
Date : 01-01-2022 - 1:18 IST -
Andhra Pradesh: పింఛన్ల ను రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, హెచ్ఐవీ పేషెంట్లు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు ఇచ్చే సామాజిక పింఛన్లను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటిదాకా నెలకు రూ.2,250 ఇస్తుండగా.. నూతన సంవత్సర కానుకగా ఇవాళ్లి నుంచి రూ.2,500కు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వం నెలకు పెన్షన్లపై రూ.1,570 కోట్లు ఖర్చు చేయనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఇవ
Date : 01-01-2022 - 12:49 IST -
Corona: ఈ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట,
Date : 01-01-2022 - 12:27 IST -
Corona: పిల్లల టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం
దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్ యాప్‌లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రెజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభి
Date : 01-01-2022 - 11:49 IST -
Vaishno Devi: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి
జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
Date : 01-01-2022 - 8:58 IST -
Liquor Sale:రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
2021 డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డ్ నమోదు చేసింది. డిసెంబర్ 01 నుంచి 31వరకు . 3350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.
Date : 01-01-2022 - 6:45 IST -
2022: తెలంగాణాలో న్యూ ఇయర్ వేడుకలు
తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు న్యూ ఈయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Date : 01-01-2022 - 12:39 IST -
HYN: హైదరాబాద్ పోలీసుల నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
Date : 01-01-2022 - 12:07 IST -
New Zealand: కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి!
2022 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. ప్రఖ్యాత స్కైటవర్పై బాణాసంచా పేలుళ్లు ఆకర్షణగా నిలిచాయి. గతకాలపు జ్ఞాపకాలను మోసుకొంటూ.. రేపటి కలలు కంటూ.. నూతన ఏడాదికి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తెర తీస్తున
Date : 31-12-2021 - 5:41 IST -
Karnataka: హిందూ దేవాయాలకు స్వయంప్రతిపత్తి
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్రభుత్వ పరిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా, ఎగువ సభలో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణలను తీసివేయాలని డిమాండ్లు వస్తున్న విషయం విదితమే. ఆ డిమాండ్ ను తొలుత కర్ణాటక ప్ర
Date : 31-12-2021 - 5:24 IST -
2022: గోవాలో న్యూఇయర్ వేడుకలు.. విజయ్, రష్మిక ‘చిల్’
నేషనల్ క్రష్ రష్మిక, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు.
Date : 31-12-2021 - 5:18 IST -
India: దేశవ్యాప్తంగా స్ట్రైక్ ను విరమించుకున్న డాక్టర్లు
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌వోఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ తో చర్చల అనంతరం ఆందోళనను విరమించుకొని యధావిధిగా విధులను ప్రారంభించారు. నీట్ పీజీ
Date : 31-12-2021 - 5:16 IST -
India: వస్త్రాలపై 12% జీఎస్టీ పెంపు పై నిరసనలు
టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే అంటే రూ.1000 పెట్టి దుస్తులు కొంటే.. రూ.120 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో వ్యవసాయం
Date : 31-12-2021 - 3:52 IST -
Revanth calls: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం!
తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు.
Date : 31-12-2021 - 3:10 IST -
America: కరోనా కేసులతో అమెరికా విలవిల..
కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు మనకు ని
Date : 31-12-2021 - 3:05 IST