AP CM: ఉద్యోగులు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి!
- By Balu J Published Date - 05:46 PM, Thu - 6 January 22

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై పలు అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. ఉద్యోగుందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేసి… మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. మంచి చేయాలన్న తపనతో ఉన్నామని.. 2, 3 రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.