Kabaddi: ఉత్కంఠభరితంగా జాతీయ కబడ్డీ పోటీలు!
- By Balu J Published Date - 01:50 PM, Thu - 6 January 22
ఆధ్యాత్మిక నగరం అయిన తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలు రెండవరోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రెండవరోజు 10 టీమ్ లకు 30 మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి రోజు కబడ్డీ పోటీల్లో ఆంధ్ర జట్టు తన సత్తా చాటింది. బీహార్, కర్ణాటక జట్లు కూడా తమ సత్తాను చాటుతున్నాయి. మహిళా జట్టులో కేరళ, పుదుచ్చేరి జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు పోటీలు జరుగుతున్నాయి.