Telangana: వనమా రాఘవకు నోటీసులు
- By hashtagu Published Date - 10:56 AM, Fri - 7 January 22

వనమా రాఘవకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2001లో రాఘవపై నమోదైన కేసుకు సంబంధించి మధ్యాహ్నం 12.30లోగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. తన ఫ్యామిలీని వేధించాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆరోపిస్తూ కుటుంభం మొత్తం ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యారని.. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.