Maheshbabu: మహేశ్ బాబుకు కరోనా.. హోంఐసోలేషన్ లోకి ప్రిన్స్!
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరినీ వదలడం లేదు.
- By Balu J Published Date - 09:43 PM, Thu - 6 January 22

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కు స్వల్ప లక్షణాలు ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తనను కలిసినవాళ్లందరినీ టెస్టులు చేసుకోవాలని, విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని మహేశ్ బాబు సూచించారు. కాగా మహేశ్ ఫ్యామిలీలోనూ ఇద్దరు, ముగ్గరు కరోనా బారిన పడ్డారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022