Speed News
-
TTD: తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానాల అదనపు కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి దుకాణదారులు సహకరించాలని ఆయన కోరారు. భక్తులకు అందించేందుకు బయో డిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు వినియోగించాలని వారికి సూచించారు. ఈ మేరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో దుకాణాల నిర్వాహకులతో ధర్మా
Date : 30-12-2021 - 2:24 IST -
Andhra Pradesh: సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవల అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. దాంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. చర్చల తర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్
Date : 30-12-2021 - 12:34 IST -
Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం
కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేస
Date : 30-12-2021 - 12:20 IST -
Teenage Vaccine: టీనేజర్ల వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింద
Date : 30-12-2021 - 11:36 IST -
India: రాష్ట్రం మొత్తం AFSPAను విస్తరించిన కేంద్రం
AFSPA ను గురువారం నుండి మరో ఆరు నెలల వరకు నాగాలాండ్ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. AFSPA ( ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. AFSPA సైనికులకు అపరిపిమిత అధికారాలు ఇస్తుంది. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సాక్ష్యాధారాలు ల
Date : 30-12-2021 - 11:29 IST -
India: నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థానీలను హతమార్చిన పోలీసులు
నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థాన్ పౌరులను హతమార్చినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బుధవారం సాయంత్రం అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లోనిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో వారిని హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ లో చనిపోయిన వారందరూ కూడా జైష్ ఈ మహమూద్ అనే ఉగ్రవాద ముఠాకు చెందిన వారని పోలీస
Date : 30-12-2021 - 10:52 IST -
Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా
Date : 30-12-2021 - 10:25 IST -
Complaint Against PCC Chief: రేవంత్ పై 5 నెలల్లో 500 ఫిర్యాదులు
తెలంగాణ పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి భాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయనపై ఏఐసీసీకి వందల ఫిర్యాదులు వెళ్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. నేతలు పైకి బాగానే మాట్లాడుకుంటుంన్నట్లు కనిపించినా మెయిల్స్ ద్వారా ఏఐసీసీకి ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 30-12-2021 - 8:00 IST -
RadheShyam:వైజాగ్ నుంచి మొదలైన రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్..
ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
Date : 30-12-2021 - 7:30 IST -
KTR On BJP:సోము వీర్రాజుపై మంత్రి కేటీఆర్ సెటైర్లు.. వాట్ ఏ షేమ్ అంటూ ట్వీట్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజాగ్రహా సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతున్నాయి. రూ.75కే చీప్ లిక్కర్ ఇస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు పై సెటైర్లు వేశారు.
Date : 29-12-2021 - 10:49 IST -
AIMIM:నోట్ల రద్దు వైఫల్యాన్ని మోదీ అంగీకరించాలి – ఓవైసీ
ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు.
Date : 29-12-2021 - 10:47 IST -
Omicron in AP:ఏపీలో ఒక్క రోజే 10 ఒమిక్రాన్ కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్క రోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు
Date : 29-12-2021 - 8:42 IST -
Kidambi Srikanth:భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఏపీ సీఎం జగన్ భారీ నజరాన.. !
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు.
Date : 29-12-2021 - 8:26 IST -
AP:ఏపీలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే..
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నందున మరోసారి వైద్య ఆరోగ్యశాఖ ఫీవర్ సర్వేను ప్రారంభించింది.
Date : 29-12-2021 - 8:20 IST -
Charan to Sam: సమంతకు సపోర్ట్.. ‘బిగ్గర్ అండ్ స్ట్రాంగర్’ అంటూ రియాక్షన్!
నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత నటి సమంతా ట్రోలింగ్‌కు గురైంది. ఎన్నో పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు, హీరోలు ఆమెకు మద్దతు నిలిచారు.
Date : 29-12-2021 - 6:04 IST -
UP: దళిత బాలిక వీడియోను షేర్ చేస్తూ ప్రియాంకా గాంధీ హెచ్చరిక
దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఓ దళిత మైనర్ బాలికను కర్రలతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి చర్యల పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 24 గంటల్లో నిందితులని అదుపులోకి తీసుకోకుంట
Date : 29-12-2021 - 5:07 IST -
Dr Ramesh Babu: డాక్టర్ పోతినేని రమేష్ బాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నుండి కార్డియాలజీలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కె శరణ్ అవార్డును అందుకున్నారు.
Date : 29-12-2021 - 4:57 IST -
India: లీటర్ పెట్రోల్‌పై రూ.25 డిస్కౌంట్
పెట్రోల్ ధరల భారంతో విలవిల్లాడుతున్న ద్విచక్ర వాహనదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది కాంగ్రెస్ కూటమిలోని ఝార్ఖండ్ ప్రభుత్వం. మోటార్‌సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరి 26 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెపింది. Jharkhand government has decided to give a concession of Rs 25 per litre petrol to motorcycles and scooter riders. This will be implemented from […]
Date : 29-12-2021 - 4:23 IST -
AP CM: సీఎం జగన్ ను కలిసిన కిదాంబి శ్రీకాంత్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (BWF World Championships) 2021 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీకాంత్ ప్రదర్శన పట్ల ప్రతిఒక్కరూ గర్వించారు. తాజాగా ఈ భార
Date : 29-12-2021 - 3:19 IST -
TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు..
నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కానీ ఆయా రోజులలో వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం ఉంటుందన్నారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు సిఫారసు లేఖలతో దర్శనాలకు రాకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేవలం వీఐపీలను అనుమతిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో
Date : 29-12-2021 - 3:14 IST