Cinema: ఓటీటీలో ‘అఖండ’.. స్ట్రీమింగ్ ఆ రోజే!
- By hashtagu Published Date - 12:23 PM, Thu - 6 January 22

బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం… బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన అఖండ… ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమైది.
జనవరి 21న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ‘అఖండ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది.