Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
- By hashtagu Published Date - 11:08 AM, Thu - 6 January 22

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం కేసులలో 2,630 ఓమిక్రాన్ కేసులుగా అధికారులు గుర్తించారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/XLFKXylyRO pic.twitter.com/HqiNuPTlIZ
— Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2022