HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Vijays Harsh Comments On Stalins Regime Spark Fire

స్టాలిన్‌ పాలనపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamilaga Vettri Kazhagam
Tamilaga Vettri Kazhagam
Tamilaga Vettri Kazhagam  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ‌ వెల్లూరు జిల్లా కొల్లమంగళంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు.

“స్పష్టంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య యుద్ధం. ఇది తమిళనాడు ప్రజలకు, అవినీతికి మధ్య… ప్రజలకు, లంచగొండితనానికి మధ్య… ప్రజలకు, డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం” అని విజయ్ అన్నారు. ఓటు తమ హక్కు అని, దానిని ఎవరూ కొనలేరని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడు రాజకీయ పరిస్థితిని వివరిస్తూ ఆయన ఓ జల్లికట్టు ఎద్దు కథను ఉదాహరణగా చెప్పారు. “ఆ కథలో ఎద్దు తమిళనాడు రాజకీయ పరిస్థితికి ప్రతీక. దానితో పోరాడే అబ్బాయి కేవలం నేను కాదు, మనమందరం. మార్పు కోసం ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారికి పరిష్కారాలు కావాలి కానీ భయం కాదు” అని వివరించారు.

నెలవారీ కరెంట్ బిల్లుల హామీ ఏమైందని విజయ్ డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత, కొండ గ్రామాల్లో బస్సు సౌకర్యాల కొరత, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో అమ్మాయిలు, అబ్బాయిల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత తమ ఆస్తుల వివరాలను నేతలు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. తనను ‘స్నేహితుడు’ అని స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… “నేనే మీ స్నేహితుడినైతే వివాదాల్లోకి నా పేరు ఎందుకు లాగుతున్నారు?” అని ప్రశ్నించారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని, ప్రతి పోలింగ్ బూత్ విజయం సాధించే బూత్‌గా మారాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి క్యూఆర్ కోడ్ పాసులు ఉన్న 4,900 మందిని మాత్రమే అనుమతించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 Tamil Nadu Elections
  • actor vijay
  • Chief Minister MK Stalin
  • CM MK Stalin
  • corruption
  • DMK Government
  • jallikattu
  • political campaign
  • Tamil Nadu elections
  • Tamil Nadu Elections 2026
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam
  • Tamilaga Vettri Kazhagam (TVK)
  • Tamilaga Vettri Kazhagam party
  • tvk

Related News

Hoisting a black flag to protest the Delimitation Bill

MK Stalin: కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం’గా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగ

  • Stalin convenes urgent virtual meeting of DMK MPs

    MK Stalin: డీలిమిటేషన్‌ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.

  • Rajasekhar About Daughters Marriage

    Rajasekhar: కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్

  • Jana Nayagan Leak

    విజయ్ ‘జన నాయగన్’ సినిమా లీక్..

Latest News

  • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • MP Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్..భారీగా పెరగనున్న జీతాలు !!

  • Rain Alert : తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి 4 రోజులు వర్షాలు!

  • Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

  • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd