Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని
- Author : Prasad
Date : 19-06-2026 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలోని కృష్ణలంక యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో వస్తున్న అక్రమ నిర్బంధం, కస్టడీ మరణం, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. “మంచి ప్రభుత్వం అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికైనా చట్టబద్ధమైన న్యాయం, నిర్దోషికి సంపూర్ణ రక్షణ కల్పించగల ప్రభుత్వం” అని కేశినేని నాని పేర్కొన్నారు. సాయికృష్ణపై ఎన్ని కేసులు ఉన్నాయన్నది ప్రధాన అంశం కాదని, చట్టబద్ధమైన దర్యాప్తు జరగడం అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులకు చట్టాన్ని అమలు చేసే అధికారం మాత్రమే ఉందని, శిక్ష విధించే అధికారం లేదని స్పష్టం చేశారు. గాదే సాయికృష్ణ కేసులో వస్తున్న ఆరోపణలు నిజమైతే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌ను విధుల నుంచి తప్పించి, నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని, సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు
https://x.com/kesineni_nani/status/2067807127620706492?s=20