Devotional
-
Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణాష్టమి రోజు దీపం ఎప్పుడు వెలిగించాలి?..ఏ దిక్కున వెలిగించాలంటే?
శ్రీకృష్ణుని జననం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 16 అర్ధరాత్రి 12:05 నుంచి 12:51 మధ్య పూజ చేస్తే అత్యద్భుత ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 7:30 IST -
Krishna Janmashtami : శ్రీకృష్ణుని ప్రీతికరమైన రంగులు, పూలు, వస్తువులు ఏమిటో తెలుసా?
శ్రీకృష్ణుడికి గులాబీ, ఎరుపు, పసుపు, నెమలి పక్షి రంగులు అంటే ఎంతో ఇష్టం. ఇవి ఆధ్యాత్మికంగా కూడా శక్తివంతమైన రంగులుగా పరిగణించబడతాయి. కృష్ణాష్టమి రోజున ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల గోపాలుడి కృప సులభంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Date : 16-08-2025 - 7:00 IST -
Krishna Janmashtami: రేపే కృష్ణాష్టమి.. పూజ ఎలా చేయాలంటే?
ఈ రోజున భక్తులు కృష్ణుడి లీలలు, కథలు చదువుకుంటూ జాగరణ చేస్తారు. ఇంకా పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఊయల ఊపుతూ కృష్ణుడి పాటలు పాడతారు. కొన్ని చోట్ల ఉట్టి కొట్టే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
Date : 15-08-2025 - 9:42 IST -
Kedarnath : కేదారనాథ్‌లో ఏదో ఉంది… అంతుపట్టని రహస్యం..ఎవరు నిర్మించారు? ఎప్పుడు?..!
ఈ గుడి నిర్మాణం గురించి స్పష్టమైన చరిత్ర లేకపోయినా 8వ శతాబ్దం నాటిదని అంటారు. అంటే 1200 ఏళ్ల నాటిదైన ఈ ఆలయం వాతావరణం, ప్రకృతి విపత్తులకు ఎటువంటి భయమూ లేకుండా నిలిచిపోయింది. ఈ రోజునాటికీ ఎవరు నిర్మించారో, ఎలా నిర్మించారో అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు.
Date : 15-08-2025 - 12:05 IST -
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
Date : 14-08-2025 - 10:47 IST -
Raksha Bandhan : నేడు రాఖీ పౌర్ణమి..ఈ సమయంలోనే రాఖీ కట్టాలి
Raksha Bandhan : రాఖీ పౌర్ణమి పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బంధాల విలువను తెలియజేస్తుంది. ఈ పండుగ సోదరీ సోదరుల మధ్య ఉన్న బంధాన్ని, వారి ప్రేమను గుర్తు చేస్తుంది. సమాజంలో కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ఈ పండుగ చాటి చెబుతుంది
Date : 09-08-2025 - 8:03 IST -
Varalakshmi Vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా?
శ్రావణ మాసం అంటేనే వ్రతాలకు, పూజలకు, పండుగలకు నెలవు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Date : 08-08-2025 - 6:45 IST -
Varalakshmi Vratam: రేపే వరలక్ష్మి వ్రతం.. పూజా విధానం ఇదే!
ఆ తర్వాత కలశం వద్ద ఉన్న అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి.
Date : 07-08-2025 - 3:47 IST -
Krishna Janmashtami 2025 : మథుర , బృందావన్‌లో కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?..అక్కడి ప్రత్యేకతలు తెలుసా?
ఈ సంవత్సరం, అంటే 2025లో జన్మాష్టమి పండుగను ఆగస్టు 16న ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకంగా మథుర మరియు బృందావనంలోని ప్రముఖ బాంకే బిహారీ ఆలయంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఆలయంలో కృష్ణాష్టమి రాత్రి 12 గంటలకు నిర్వహించే మంగళ హారతి విశేష ప్రాధాన్యత కలిగినది.
Date : 06-08-2025 - 3:31 IST -
Sravana Masam : శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలి?
Sravana Masam : ఈ ఏకాదశిని పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశిగా జరుపుకుంటారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
Date : 05-08-2025 - 7:00 IST -
TTD : తిరుమలలో పవిత్రోత్సవాలు..ఆర్జితసేవలు రద్దు: టీటీడీ
ఇది పవిత్రోత్సవాల ప్రాధమిక భాగం కాగా, తద్వారా త్రిదినోత్సవాలకు శుభారంభం ఏర్పడుతుంది. పవిత్రోత్సవాల ప్రాముఖ్యత ఏమిటంటే, సంవత్సరమంతా ఆలయంలో జరిగే వివిధ రకాల ఆర్చనలు, సేవలు, ఉత్సవాల్లో యాత్రికుల నుంచి, ఆలయ సిబ్బంది నుంచి అనుకోకుండా జరిగే చిన్న చిన్న దోషాలను నివారించేందుకు ఇది ఒక ఆత్మశుద్ధి ఉత్సవంగా భావించబడుతుంది.
Date : 03-08-2025 - 12:36 IST -
Jammu and Kashmir : అనంత్ నాగ్‌లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Date : 03-08-2025 - 11:02 IST -
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Date : 02-08-2025 - 4:16 IST -
Garuda Purana : స్వర్గం.. నరకం ఉంటాయా?.. మోక్షం ఉంటుందా? ..విజ్ఞానానికి సవాలుగా మారిన పురాతన రహస్యం!
ఈ యాత్రలో ఆత్మ ముళ్ళతో నిండి ఉన్న మార్గాలు, అగ్నినదులు, బురదతొ మండే ప్రాంతాలు, చీకటి గుహలు వంటి భయంకర మార్గాల గుండా వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా ఆత్మ గత జీవిత పాపాల ఫలితాలను అనుభవిస్తుంది. ఇది 84 లక్షల యోనుల్లో తిరుగుతూ తన పూర్వ కర్మల శిక్షలను పొందుతుంది. ఇది ఒక భయపడే విషయంగా కాకుండా, ఒక హెచ్చరికగా, మార్గదర్శకంగా పరిగణించాలి.
Date : 02-08-2025 - 4:04 IST -
Surya Grahan : ఆగస్టు 2న సూర్యగ్రహణం ?..అసలు నిజం ఏంటంటే?
అయితే అసలు నిజం ఏంటంటే, 2025 ఆగస్టు 2న ఎలాంటి సూర్యగ్రహణం జరగదు. కానీ అదే తేదీన రెండేళ్ల తర్వాత, అంటే 2027 ఆగస్టు 2న ఒక అరుదైన, అతి సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది.
Date : 01-08-2025 - 5:12 IST -
Dharmasthala : 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం.. ప్రత్యేకత ఏంటంటే!
ధర్మస్థల ప్రదేశం, బెల్తಂಗడి తాలూకాలోని మల్లార్మడి గ్రామంలో ఉంది. ప్రాచీనకాలంలో దీనిని "కుడుమ" అని పిలిచేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ జైనధర్మానికి చెందిన బిర్మన్న పెర్గాడే కుటుంబం నెల్లియడి బీడు అనే ఇంట్లో నివసించేది. ఒక రోజు కొంతమంది ధార్మిక సందర్శకులు వారి ఇంటికి వచ్చి, ధర్మాన్ని ఆచరించేందుకు ఒక స్థలం ఇవ్వాలని కోరగా, ఆ జంట ఆతిథ్యంగా ఆహ్వానించి వారికి సదా వ
Date : 01-08-2025 - 4:57 IST -
TTD : శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ హెచ్చరిక
టీటీడీ అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఇలాంటి అసభ్య ప్రవర్తన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని, శ్రీవారి క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. మాడ వీధులు అనే సాంప్రదాయిక ప్రాంతంలో ఇలాటి చర్యలు చేసేవారిపై విజిలెన్స్ విభాగం ఇప్పటికే దృష్టి సారించిందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Date : 31-07-2025 - 6:49 IST -
Dharmasthala : ధర్మస్థలలో బయటపడ్డ మానవ అవశేషాలు
Dharmasthala : ఈ మానవ అవశేషాల ఫోరెన్సిక్ నివేదిక.. DNA విశ్లేషణలు ఈ కేసులో మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ తీగ లాగితే మరెన్ని నిజాలు బయటపడతాయో, ఎన్ని దశాబ్దాల నాటి రహస్యాలు వెలుగు చూస్తాయో అని కర్ణాటక ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు
Date : 31-07-2025 - 5:34 IST -
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం!
ఈ కొత్త నిర్ణయం కేవలం తిరుమలలోనే కాకుండా, రేణిగుంట విమానాశ్రయంలో కూడా టికెట్ల సంఖ్యను పెంచేందుకు దోహదపడింది. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో రోజుకు 400 టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్ల కోటా పెంపుతో పాటు, దర్శన సమయంలో కూడా కీలక మార్పులు చేపట్టింది టీటీడీ.
Date : 30-07-2025 - 12:59 IST -
Snakes : పాములను చంపేస్తే ఎలాంటి దోషం తగులుతుంది?.. మరి పరిహారం ఏంటి?
ఈ దోషం ఒకటి రెండు తరాలకు కాకుండా ఏకంగా ఏడు తరాల వరకూ వంశపారంపర్యంగా ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. పాములను హింసించడం వల్ల కలిగే ఈ దోషం జీవితంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. వీటిలో ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చర్మవ్యాధులు, మానసిక ఆందోళన, అనిర్వచనీయ భయాలు, గృహశాంతి లోపించడం వంటి వాటిని ప్రస్తావించవచ్చు.
Date : 28-07-2025 - 5:13 IST