Cloves: మీ ఇంట్లో పూజా మందిరంలో రెండు లవంగాలు ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా?
Cloves: ఇంట్లో పూజా మందిరంలో రెండు లవంగాలు పెట్టుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sat - 25 October 25
Cloves: మన ఇంట్లో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అయితే ఈ లవంగం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఆరోగ్య పరంగానే కాకుండా అధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మరి లవంగాల వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో దేవుడి మందిరం ఉండే ప్రదేశం అత్యంత పవిత్రమైనది.
అందుకే పూజా గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అలాగే పూజా గృహంలో శుభం కోసం గంగాజలం, నెమలి ఈకలు, శంఖం, కొబ్బరి కాయ సహా కొన్ని వస్తువులు ఉంచాలి. పూజా గృహంలో ఈ వస్తువులు ఉంచడం శుభప్రదంగా ఉంటుందట. వీటిలో లవంగాల జత కూడా ఒకటి. లవంగాల జతను దేవుడి మందిరంలో ఉంచడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. పూజా గృహంలో లవంగాల జత ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుందట.
ఎందుకంటే లవంగాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారని, ఇంట్లో ప్రతికూలతను దూరం చేస్తుందని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుందని చెబుతున్నారు. అలాగే గ్రహాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది జీవితంపై ప్రభావం చూపుతుందట. అందుకే శని ప్రభావం తగ్గించేందుకు లవంగాలు సహకరిస్తాయట. ఇంట్లో ఉండే దేవుడి మందిరంలో కానీ, ఆలయంలో కానీ రెండు లవంగాలను ఉంచితే శని, శుక్రుడు, కుజుడు మీకు మంచి చేస్తాడని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా రాహు,కేతు దోషాలు కూడా తొలగిపోతాయట.