Dakshin: గుడికి వెళ్ళినప్పుడు పూజారికి తప్పకుండా దక్షిణ ఇవ్వాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
Dakshin: దేవాలయాలకు వెళ్ళినప్పుడు డబ్బులు కేవలం హుండీలో వేయడం మాత్రమే కాకుండా పూజారికి కూడా డబ్బులు ఇవ్వాలా అన్న సందేహం చాలా మందికి నెలకొంటూ ఉంటుంది. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:02 AM, Tue - 28 October 25
Dakshin: మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాము. అలాగే గుడి బయట బిక్షాటన చేసే బిక్షగాళ్లకు కూడా మనకు తోచినంతలో సహాయం చేస్తూ ఉంటాము. అయితే కొందరు ఆలయంలో ఉండే పూజారులకు కూడా దక్షిణ ఇస్తూ ఉంటారు. మరి ఈ విధంగా పూజారులకు దక్షిణ ఇవ్వాలా? ఇస్తే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూజారికి దక్షిణ ఇవ్వడం అన్నది తప్పనిసరి అని భావించినా అది సంస్కృతి, భక్తి, ధర్మబద్ధమైన చర్య అని గుర్తించాలి. దేవాలయాలలో పూజారిలో నిత్యం సేవ చేస్తూ ఉంటారు. వారు పూజలు హోమాలు, వ్రతాలను చాలా భక్తితో నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి జీవనాన్ని గౌరవిస్తూ మనం మనకు తోచినంత మన ఆర్థిక స్థోమతను బట్టి దక్షిణ ఇవ్వడం అన్నది ఒక మంచి పరంపరగా కొనసాగుతుందట. అయితే ఇదివరకటి రోజుల్లో అనగా రాజుల కాలంలో వారి సామర్థ్యానికి తగ్గట్టుగా పూజారులకు, దేవాలయాలకు దక్షిణ ఇచ్చేవారు.
ఆలయ పూజారులు ధర్మాన్ని కాపాడే వాళ్ళు అని భావించి వారిని సమృద్ధిగా పోషించేవారు. ఇకపోతే మామూలుగా ఒక అతిధికి భోజనం వడ్డించడానికి ఒక వంద రూపాయలు అవుతుంది అనుకుంటే, అలాంటప్పుడు ఒక పండుగ రోజు కానీ దేవాలయాలకు వెళ్లిన సందర్భంలో కానీ పూజారికి 11 లేదా 21 రూపాయలు ఇవ్వడం అన్నది పెద్ద భారం కాదు. అయితే దక్షిణ ఇవ్వడం అన్నది దానం కాదు ధర్మం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసే పూజారులకు మనకు తోచినంత దక్షిణ ఇవ్వడం అన్నది చాలా మంచి అలవాటు అని చెబుతున్నారు.