Kamdhenu: అదృష్టం, సంపద కలిసి రావాలంటే ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టాల్సిందే!
Kamdhenu: ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో కామధేనువు విగ్రహాన్ని పెడితే అదృష్టంతో పాటు సంపద కూడా కలిసి వస్తుందని ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి కామధేనువు విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:21 AM, Fri - 24 October 25
Kamdhenu: కామధేనువు విగ్రహం గురించి మనందరికీ తెలిసిందే. ఆవు తన బిడ్డకు పాలు ఇస్తున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని కామధేనువ విగ్రహం అంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇప్పుడు చెప్పినట్టుగా ఈ కామధేనువు విగ్రహాన్ని ఒక దిశలో ఉంచితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. కాగా కామధేనువు ఆవును సురభి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది.
దీనిని వశిష్టునికి బహుమతిగా ఇచ్చారు. అయితే కామధేనువు ఆవు నాలుగు కాళ్ళను నాలుగు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. కళ్ళలో సూర్యుడు చంద్రుడు, భుజాలలో అగ్ని, వాయువు, అశ్వినీ దేవతలు, కొమ్ముల కొనభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు మూలంలో శివుడు కొలువై ఉంటారని చెబుతుంటారు. కామధేనువు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా లక్ష్మి, సరస్వతి, దుర్గా ముగ్గురు ప్రధాన దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కామధేనువు ఆవు,దూడ విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే, దీని వల్ల ఇంటికి సానుకూల శక్తి పెరుగుతుందట.
వాస్తు ప్రకారం కామధేనువు ఆవు విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలట. ఈ ప్రదేశం దేవతలు కొలువై ఉండేదని, అందుకే రాగి, ఇత్తడి లేదా వెండి వంటి లోహాలతో చేసిన కామధేనువు ఆవు విగ్రహాన్ని పూజా మందిరంలో కూడా ఉంచవచ్చని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కామధేనువు ఆవు విగ్రహం మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి మీకు విజయాన్ని అందిస్తుందని చెబుతున్నారు పండితులు.