Karthika Masam 2025: కార్తీకమాసంలో ఏ రోజు ఎలాంటి పూజలు చేయాలి.. ఇలా చేస్తే కాసుల వర్షం కురవాల్సిందే!
Karthika Masam 2025: కార్తీక మాసంలో ఏ రోజున ఎటువంటి పూజ చేయాలి అలాగే, ఇంట్లో ఎలా దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Mon - 27 October 25
Karthika Masam 2025: హిందువులు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. కాగా కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసే కార్తీక దీపాలను వెలిగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. స్నానం పూర్తి అయిన తర్వాత శివాలయంలో లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయట.
కార్తీకంలో చేసే దీపారాధన, దీప దానానికి విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కోసం భక్తులు కఠిన నియమాలను కూడా పాటిస్తారు. సాధారణంగా నక్తం అంటే ఉపవాసం ఆచరిస్తారు. నక్తం అంటే ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సూర్యా స్తమయం తర్వాత నక్షత్రాలు కనబడిన తర్వాత విడిచిపెట్టేదే నక్తం అని పిలుస్తారు. కార్తీకంలో పగలు కాకుండా రాత్రి భోజనం చేయటం ఉంటుంది. నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేయడం అత్యుత్తమం అని దాన్నే నక్తం అని అంటారని చెబుతున్నారు పండితులు. కార్తీక మాసం లో ఇతరులచే పెట్టబడిన అన్నాన్ని తిననివాడు మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి.
అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా శ్రేష్ఠం. శివాభిషేకం చేసేటపుడు సాంప్రదాయ దుస్తుల్లో చేయాలి. శివాలయంలోపల కూర్చుని శివలింగమునకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని వాటిని చూస్తూ నమస్కరిస్తే దానివలన మీరు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు.
కార్తీక మాసమంతా ఆచరించలేని వారు కనీసం కార్తీక సోమవారం నాడు అయినా ఆచరించినట్లైతే వేలకొలదీ అశ్వమేధయాగ ఫలాలు పొందిన ఫలితాన్ని అందుకుంటారని చెబుతున్నారు. అర్హత కలిగిన వారు తప్పనిసరిగా కార్తీక మాసంలో నిత్యం పితృతర్పణాలనివ్వాలని పండితులు చెబుతున్నారు.