HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Tulsi Plant Rituals Must Put These Things Near Tulsi Plant

‎Tulsi Plant: కార్తీక మాసంలో తులసి మాతకు ఈ విధంగా పూజ చేస్తే చాలు.. విష్ణు అనుగ్రహంతో ధన ప్రవాహమే పెరగడం ఖాయం!

‎Tulsi Plant: కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి మొక్కకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే చాలు, దేవతల ఆశీస్సులతో పాటు మీ ఇంట్లోకి కూడా ధన ప్రవాహం పెరుగుతుందని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 06:00 AM, Mon - 27 October 25
  • daily-hunt
Tulsi Plant
Tulsi Plant

‎Tulsi Plant: కార్తీకమాసం వచ్చింది అంటే చాలు ఇంట్లో గుళ్ళలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇళ్లలో ఆలయాల వద్ద కార్తీకదీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. ఈ సమయంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి మొక్క కు కొన్ని పూజలు చేస్తే చాలు, దేవతల ఆశీస్సులతో మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది అనగా 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
‎
‎ఈ నెలంతా శ్రీ మహా విష్ణువు, శ్రీ కృష్ణుడి ఆరాధనకే అంకితం చేయాలని మనలోని చెడును వదిలించుకుని, భక్తి మార్గంలో నడవడానికి ఇది సరైన సమయం అని పండితులు చెబుతున్నారు.తులసి మొక్క విషయానికొస్తే తులసి సాక్షాత్తుగా లక్ష్మీ దేవి స్వరూపం. అందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో తులసిని మనస్ఫూర్తిగా పూజిస్తే, ఆ ఇంట్లో సంతోషానికి, ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. కార్తీక మాసంలో మీ ఇంట్లో సంపద పెరగాలంటే, కొన్ని పవిత్రమైన వస్తువులను తులసి మొక్క దగ్గర ఉంచి, చిన్న చిన్న పూజలు చేయాలని చెబుతున్నారు.
‎
‎గోమతి చక్రం.. కాగా గోమతి నదిలో లభించే ఈ పవిత్రమైన వస్తువును శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరి స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో కొన్ని గోమతి చక్రాలను తులసి మొక్క దగ్గర ఉంచితే, ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత, స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో అస్సలు మిస్ చేయకూడని ముఖ్యమైన నియమం ఇది. రోజూ సాయంత్రం వేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలట. ఆ దీపం కాంతి మనలోని అజ్ఞానాన్ని పోగొడుతుందని, ఇది విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేస్తుందని, వారి ఆశీస్సులు లభిస్తే, డబ్బుకు అస్సలు లోటు ఉండదని చెబుతున్నారు. కాబట్టి కార్తీక మాసంలో తులసి కోట వద్ద నెయ్యితో దీపారాధన చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలాగే తులసి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
‎
‎ పసుపు కొమ్ముపసుపు శుభానికి, అదృష్టానికి చిహ్నం. విరగని పసుపు కొమ్మును తులసి మొక్క మొదట్లో ఉంచడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిపోయి, డబ్బు నిలిచే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అలాగే కార్తీక మాసంలో ఉండాల్సిన వస్తువులలో సాలగ్రామం కూడా ఒకటి. ఇది మనకు పూజ స్టోర్ లో లభిస్తూ ఉంటుంది. ఈ సాలగ్రామం అన్నది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువుకు గుర్తు. తులసి మొక్క దగ్గర సాలగ్రామాన్ని ఉంచడం చాలా శుభప్రదం. ఇది విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల పవిత్ర బంధానికి ప్రతీకగా చెబుతున్నారు. ఇలా చేస్తే వారిద్దరి పూర్తి అనుగ్రహంతో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందట. ఈ వస్తువులను పెట్టడమే కాదు, ఈ నెలంతా కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. అవేంటంటే, రోజూ ఉదయం స్నానం చేశాక, తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి. ఇది ఇంట్లోకి సంతోషాన్ని, సంపదను తెస్తుందట. అయితే ఆదివారం రోజున తులసికి నీరు పోయకూడదట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deeparadhana
  • pooja
  • tulsi plant
  • Tulsi Plant 2025

Related News

    Latest News

    • Jaggery: అధిక యూరిక్ యాసిడ్‌లో బెల్లం తినవచ్చా లేదా?

    • #ChiruBobby2 : చిరు మూవీ లో సూర్య తమ్ముడు ..?

    • Settipally Ramasundhar Reddy : ఏపీ కలెక్టర్ గొప్ప మనసు.. ఉచితంగా ఎకరం స్థలం.!

    • Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి

    • Australia: టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌.. ఆసీస్‌కు ఎదురుదెబ్బ‌!

    Trending News

      • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

      • Rohit Sharma: రోహిత్ శర్మ సంచ‌ల‌న పోస్ట్.. అభిమానులకు ‘చివరిసారిగా… వీడ్కోలు’ అంటూ!

      • Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!

      • Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

      • Rohit Sharma- Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీ ఆడ‌నున్న విరాట్‌, రోహిత్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd