HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Uttarakhand Chardham Yatra Gangotri Dham Shut Kedarnath Yamunotri To Close Doors On Thursday

Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత‌!

చార్‌ధామ్‌లలోని రెండు ప్రధాన మతపరమైన పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి. ఈ రెండు చోట్లా ఈసారి దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.

  • By Gopichand Published Date - 09:28 PM, Wed - 22 October 25
  • daily-hunt
Chardham Yatra
Chardham Yatra

Chardham Yatra: దీపాల పండుగ దీపావళితో పాటు చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra)లో భాగమైన రెండు పుణ్యక్షేత్రాల తలుపులు మూసివేయబడనున్నాయి. ఈ రెండు ధామాలలో యమునోత్రి, గంగోత్రి ఉన్నాయి. ఈ రెండు ధామాలను మూసివేయడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మోక్షాన్ని ప్రసాదించే గంగా, యమునా మాతకు ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఈ రెండు ధామాల తలుపులు శీతాకాలం కోసం మూసివేయబడతాయి. దీనికి గోవర్ధన పూజ రోజున శ్రీకారం చుట్టనున్నారు. ఆ మరుసటి రోజు అంటే భాయ్ దూజ్ నాడు యమునోత్రి తలుపులు మూసివేసి యాత్రకు విరామం పడనుంది.

గంగోత్రి- యమునోత్రి తలుపులు ఈ రోజులలో మూతపడతాయి

సమాచారం ప్రకారం.. చార్‌ధామ్‌లలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటైన గంగోత్రి తలుపులు నేడు అంటే అక్టోబర్ 22, 2025 (గోవర్ధన పూజ) రోజున మూసివేయబడతాయి. ఈ రోజు ఉదయం 11 గంటల 36 నిమిషాలకు గంగోత్రి తలుపులు మూసివేయబడతాయి. ఇక మరుసటి రోజు అంటే అక్టోబర్ 23, 2025 (గురువారం, భాయ్ దూజ్) నాడు యమునోత్రి తలుపులు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మూతపడతాయి.

Also Read: Cholesterol: కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ఆహార ప‌దార్థాలివే!

శీతాకాలంలో గంగా, యమునా దర్శనాలు లభిస్తాయి

గంగోత్రి- యమునోత్రి తలుపులు మూసివేసిన తర్వాత శీతాకాలంలో భక్తులు యమునా మాత ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలో, గంగా మాత ఉత్సవ విగ్రహాన్ని ముఖ్బా గ్రామంలో దర్శించుకోవచ్చు. గంగా మాత- యమునా మాతల ప్రత్యేక పూజల కోసం ఈ రెండు ధామాలను పూలమాలలతో అలంకరించారు. ఇక్కడ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇక్కడ దీపావళి చాలా వైభవంగా జరిగింది

చార్‌ధామ్‌లలోని రెండు ప్రధాన మతపరమైన పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి. ఈ రెండు చోట్లా ఈసారి దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీటిని చక్కగా అలంకరించారు. భక్తులు, పూజారులు గంగా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా కాంతులీనింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Char Dham Yatra 2025
  • Chardham Yatra
  • Gangotri Dham
  • Kedarnath
  • uttarakhand
  • Yamunotri

Related News

    Latest News

    • Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

    • Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత‌!

    • Men Or Women: పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో తెలుసా?

    • Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు

    • US Tariffs: భార‌త్‌కు గుడ్ న్యూస్‌.. టారిఫ్ భారీగా త‌గ్గింపు!

    Trending News

      • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

      • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

      • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd