Transgender: హిజ్రాల నుంచి డబ్బులు తీసుకుంటే నిజంగానే మంచి జరుగుతుందా?
Transgender: హిజ్రాల నుంచి డబ్బులు తీసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని మంచి జరుగుతుంది అని చెబుతుంటారు. ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Thu - 23 October 25

Transgender: మన చుట్టూ ఉన్నవారిలో ఎక్కువ శాతం మంది మగవారు లేదంటే ఆడవారు కనిపిస్తూ ఉంటారు. వీరిద్దరూ కాకుండా అప్పుడప్పుడు ట్రాన్స్ జెండర్లు కూడా కనిపిస్తూ ఉంటారు. వీరిని హిజ్రాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీరు మనకు ఎక్కడ అయినా షాప్స్ వద్దా లేదా స్పీడ్ బ్రేకర్స్ వద్ద అలాగే ట్రైన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే కొంతమంది హిజ్రాలకు డబ్బులు ఇచ్చి తర్వాత వారి దగ్గర నుంచి రూపాయి నాణెం వంటివి ఇప్పించుకుంటూ ఉంటారు. అలాగే వస్త్రాలు డబ్బులను ధాన్యాలను దానంగా కూడా ఇస్తూ ఉంటారు.
ఇలా ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి ఒక్క రూపాయి తీసుకుంటే అది చాలా మంచిదిగా భావిస్తారు. కొందరు హిజ్రాల నుంచి పొందిన రూపాయి నాణేన్ని గుడ్ లక్ తో పోలుస్తారు. అయితే మరి నిజంగా హిజ్రాల నుంచి పొందిన ఒక రూపాయి నాణెం కెరీర్ వ్యాపారం కోసం శుభంగా పరిగణించబడుతుందా? ఇందులో నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిజ్రాల సంబంధం బుధ గ్రహంతో ముడిపడి ఉంది. హిజ్రాలకు డబ్బు లేదా దానం ఇవ్వడం ద్వారా బుధ గ్రహం నుంచి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
హిజ్రాల నుంచి ఒక రూపాయి తీసుకుంటే మంచి జరుగుతుందని, మీరు అడగకుండా వారు ఇస్తే మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఒక రూపాయితో పాటు హిజ్రాల నుంచి 2, 5 లేదా 10 రూపాయలు పొందడం కూడా శుభప్రదం అని, అయితే హిజ్రాలను మీరు డబ్బులు అడగకూడదని, ఒకవేళ హిజ్రాలు తమ ఇష్టంతో మీకు డబ్బులు ఇస్తేనే, అప్పుడు దీని శుభ ఫలం లభిస్తుందని చెబుతున్నారు. హిజ్రాల నుంచి పొందిన డబ్బులో సానుకూలత ఉంటుందట. దీనివల్ల జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయని, దానిని దేవుని ఆశీర్వాదంగా భావించి గౌరవించాలని, అలా ఇచ్చిన డబ్బులని ఖర్చు చేయడానికి బదులుగా ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో లేదా పర్సులో ఉంచాలని చెబుతున్నారు.