HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan In Illusions Anyone Tell Me

Jagan In Illusions: భ్రమల్లో జగన్‌.. ఎవరయినా చెప్పండయ్యా!

అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్‌ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్‌లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్‌ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్‌ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.

  • Author : Naresh Kumar Date : 06-02-2025 - 6:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan Tweet
YS Jagan Tweet

Jagan In Illusions: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి… పూర్తి భ్రమల్లో (Jagan In Illusions) మునిగితేలుతున్నారా?? లేక, ఆయనకి రిపోర్టులు సరిగా అందించడం లేదా.? గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితిని ఆయనకి ఉన్నది ఉన్నట్లుగా చేరవేయడంలో వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారా?? లేక, ఆయనని మోసం చేస్తున్నారా.?? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైసీపీ కేడర్‌ని వేధిస్తున్నాయి.

అధికారం కోల్పోయిన నాటి నుండి జగన్‌ నోటి నుండి వెలువడుతున్న స్పీచ్‌లలో పదజాలం మారడం లేదు.. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100 శాతం అమలు చేశానని, ప్రజలకు బటన్‌ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టానని, ఇటు కూటమి సర్కార్‌ మాత్రం హామీలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేస్తున్నారు.. కొత్త ఏడాది కొత్తగా లండన్‌ వెళ్లి వచ్చిన తర్వాత అయిన జగన్‌ తన రూట్‌ మార్చుకుంటారని, కూటమి సర్కార్‌పై సద్విమర్శలు చేస్తారని ఆశించారంతా.. కానీ, జగన్‌ అదే డప్పు కొట్టుకుంటున్నారు.. కూటమి సర్కార్‌ సూపర్‌ సిక్స్‌ని పట్టించుకోవడం లేదని, ఆయన బిర్యానీ పెడితే… కూటమి ప్రభుత్వం కనీసం పలావు కూడా వడ్డించడం లేదని విమర్శిస్తున్నారు.

Also Read: Gig Workers : గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్లకు పెన్షన్ స్కీం.. ప్రయోజనం ఇలా..

అంతేకాదు, తన లిక్కర్‌ పాలసీ అద్భుతమని, ప్రయివేటు వ్యక్తులకు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి మరీ పంపిణీ చేసిందని, దీనిలో ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు వైసీపీ అధినేత.. ఈ వితండవాదమే జగన్‌కి మైనస్‌గా మారుతోంది.. నాణ్యతలేని లిక్కర్‌తో వేల మంది ప్రాణాలను తీశారని నేటి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరిస్తుంటే, జగన్‌ మాత్రం తాను శుద్ధపూస… సుప్పిని..సంప్రదాయిని అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఈ అంశంపై వైసీపీ శ్రేణులు సైతం జగన్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు..

ఈ తీరునే వైసీపీ సొంత కేడర్‌ తప్పు పడుతోంది.. నిజంగా ఏపీ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు.?? వారు ఆశిస్తున్నది ఏమిటి.??? జగన్‌ ఇప్పటికీ ఆత్మావలోకనం చేసుకోలేదని అర్ధం అవుతోంది.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదు.. రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం ఇంచ్‌ పురోగతి లేకుండా ఐదేళ్లు ఎలా నానబెట్టాడో ప్రజలంతా చూశారు. ఇక, మూడు రాజధానులతో జగన్‌.. అమరావతిని ఎలా చంపాడో చూశాం.. రోడ్లని గుంతలమయం చేశాడు. ఉద్యోగాలు రాకుండా, కంపెనీలు అడుగుపెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.. ఇవే జగన్‌కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి.. తాను కేసుల నుండి బయటపడడానికి, అధికారాన్ని సంపాదనకు కేరాఫ్‌గా మార్చుకొని ఏపీని నాశనం చేశాడు.. ఇవే జగన్‌ని అధికారానికి దూరం చేశాయి..

ఇలాంటి అంశాలేవీ జగన్‌కి చేరలేదా..?? ఆయనకి తెలియదా..? తెలిసినా మేనిఫెస్టోనే హైలైట్‌ చేయాలనుకుంటున్నారా?? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.. కొందరు మాత్రం తాము జగన్‌కి చెప్పినా వినడం లేదని, నవరత్నాల జపం తప్ప మరేమీ చేయడం లేదని వాపోతున్నారు.. మరికొందరు మాత్రం జగన్‌కి ఇంకా బుద్ధి రాలేదని, ఆయన ఇంకా మేనిఫోస్టో మోజులోనే ఉన్నారని చెబుతున్నారు.. మొత్తమ్మీద, ఆయన భ్రమల్లో ఉన్నారని అంటున్నారు ఇంకొందరు వైసీపీ నేతలు.. మరి, ఆయనను నిద్ర నుండి ఎవరు మేల్కొలుపుతారు..?? టోటల్‌గా జగన్‌ 2.O ఏమో కానీ, భ్రమ 2.O నుండి బయటకు రావాలని వైసీపీ నేతలే కోరుకుంటున్నారు.. మరి, భజనలకు అలవాటు పడిన ఈ వైసీపీ దేవుడు భ్రమల నుండి బయటకు వస్తారా..??


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • bjp
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd