Gig Workers : గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్లకు పెన్షన్ స్కీం.. ప్రయోజనం ఇలా..
గిగ్ వర్కర్లు(Gig Workers) చేసే ప్రతీ సర్వీసు లావాదేవీ నుంచి నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని ‘సామాజిక భద్రతా చెల్లింపు’ కోసం కేంద్ర కార్మికశాఖ సేకరించనుంది.
- By Pasha Published Date - 06:23 PM, Thu - 6 February 25

Gig Workers : స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, జొమాటో, ఉబెర్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సర్వీసుల్లో పనిచేసే గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే వారి కోసం ప్రత్యేక పింఛను పథకం అమల్లోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు కార్మిక శాఖ పంపనుంది.
Also Read :Nara Bhuvaneshwari: సీఎం అయినా టికెట్ కొంటేనే మ్యూజికల్ నైట్ షోకు ఎంట్రీ : నారా భువనేశ్వరి
పింఛను స్కీం అమలు ఇలా ఉండొచ్చు..
- గిగ్ వర్కర్లు(Gig Workers) చేసే ప్రతీ సర్వీసు లావాదేవీ నుంచి నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని ‘సామాజిక భద్రతా చెల్లింపు’ కోసం కేంద్ర కార్మికశాఖ సేకరించనుంది.
- పింఛను కోసం ప్రతీ లావాదేవీపై ఎంత శాతాన్ని సేకరించాలనే దానిపై కేంద్ర కార్మిక శాఖ ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదు.
- వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తరహాలో ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ సర్వీసుల సంస్థల బిల్లుల నుంచి నిర్బంధంగా సేకరిస్తారు.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆన్‌లైన్ సర్వీసుల్లో పనిచేసే గిగ్ వర్కర్లు కూడా ఈ పింఛను స్కీంకు అర్హులే.
- గిగ్ వర్కర్ల పింఛను ఖాతాలో జమ అయ్యే డబ్బుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణీత రేటులో వడ్డీని చెల్లిస్తుంది.
- పింఛను ఖాతాలోని డబ్బును పదవీ విరమణ వయసులో విత్ డ్రా చేసుకోవచ్చు.
- పింఛను డబ్బుల విత్‌డ్రాకు రెండు ఆప్షన్లు ఇస్తారు.
- పింఛను ఖాతాలోని డబ్బులపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకొని, అసలును వదిలేయడం అనేది తొలి ఆప్షన్.
- పింఛను ఖాతాలో జమైన మొత్తం డబ్బును కొన్ని ఈఎంఐ వాయిదాలలో బ్యాంకు ఖాతాలోకి డైవర్ట్ చేసుకోవడం అనేది రెండవ ఆప్షన్.
- పింఛను విత్ డ్రాకు సంబంధించి వీటిలో ఏ ఆప్షన్‌ను అయినా గిగ్ వర్కర్ ఎంపిక చేసుకోవచ్చు.
Also Read :Sobhita Dhulipala : శోభిత బోల్డ్ సీన్లు చైతుకు బాగా నచ్చాయట..!!
- గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులను జారీ చేస్తామని ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
- గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని నిర్మల చెప్పారు.
- ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ స్కీం ద్వారా గిగ్ వర్కర్లు ఆరోగ్య సేవలు పొందే ఛాన్స్ కల్పిస్తామన్నారు.