HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The People Are The Ultimate Arbiters Of A Historic Victory Deputy Cm Pawan

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 3:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.
The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘రెండేళ్ల క్రితం ప్రజలు మాకు కేవలం అధికారాన్ని ఇవ్వలేదు.. ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే 2024 ఎన్నికల ఫలితం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం కూటమి ఏర్పడింది. అధికారాన్ని పంచుకోవడం కోసం కాదు.. బాధ్యతను పంచుకోవడం కోసం ఈ కూటమి ముందుకొచ్చింది’’ అని పవన్‌ అన్నారు. జనసేన కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ప్రజల ఆశీర్వాదంతో అన్ని స్థానాల్లో విజయం సాధించడం తమపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్‌ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఎన్‌డీయే ప్రభుత్వ సమష్టి కృషి వల్ల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగామని తెలిపారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ఇటీవల జరిగిన విశాఖ స్టీల్‌ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని పవన్‌ పేర్కొన్నారు. ఆ దుర్ఘటన కారణంగానే ఈ నెల 9న జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఇప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • AP Deputy CM Pawan kalyan
  • AP Kutami Govt
  • Coalition Government
  • janasena party

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • AP Police arrest YouTuber Ravan.

    YouTuber Prashna Ravan: యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd