Andhrapradesh
-
#Andhra Pradesh
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు
Nara Lokesh Parliament Budget Session తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు. శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన […]
Date : 26-01-2026 - 10:14 IST -
#Andhra Pradesh
పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళి రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సీఎం చంద్రబాబు అభివృద్ధి […]
Date : 24-01-2026 - 10:41 IST -
#Andhra Pradesh
పేరు కే కూలి ఇంట్లో బయటపడ్డ భారీ సంపద..!
Old Woman House గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునే ఒక వృద్ధురాలి […]
Date : 24-01-2026 - 10:24 IST -
#Andhra Pradesh
మినిస్టర్ లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
Nara Lokesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం లోకేశ్ పడుతున్న తపనను, ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా వ్యవస్థలో లోకేశ్ మార్పులను కొనియాడిన జనసేనాని ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనకు లోకేశ్ […]
Date : 23-01-2026 - 10:42 IST -
#Andhra Pradesh
వరికపూడిశెల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Varikapudisela Irrigation Project ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు రూ.3,227.15 కోట్లు ఖర్చవుతుంది. మరోవైపు, కడప, ప్రకాశం జిల్లాల్లో 800 మెగావాట్ల రాజుపాలెం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కూడా అనుమతులు లభించాయి. అన్నమయ్య జిల్లా వీరబల్లి ప్రాజెక్టు అనుమతులు మాత్రం ప్రస్తుతం నిలిపివేశారు. ఏపీలో మరో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది […]
Date : 23-01-2026 - 10:33 IST -
#Andhra Pradesh
కోటప్పకొండను దర్శించుకున్న పవన్ కల్యాణ్
కోటప్పకొండ-కొత్తపాలెం రోడ్డును ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ పవన్ కు స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దైవ భక్తి చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీలున్నప్పుడల్లా ఆయన దేవాలయాలను దర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్న పవన్ కు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన […]
Date : 22-01-2026 - 1:39 IST -
#Andhra Pradesh
నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవీ వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కూతలు ఆపాలని.. దమ్ముంటే […]
Date : 21-01-2026 - 3:24 IST -
#Andhra Pradesh
శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం
Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్‌పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం జల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం డ్యామ్ […]
Date : 21-01-2026 - 11:42 IST -
#Andhra Pradesh
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ మంత్రి విజయసాయి […]
Date : 17-01-2026 - 12:19 IST -
#Andhra Pradesh
పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. గుంటూరు భోగి వేడుకల్లో […]
Date : 14-01-2026 - 10:37 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భారీ ఊరట స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు మూసివేత […]
Date : 13-01-2026 - 2:29 IST -
#Andhra Pradesh
సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సంక్రాంతి వేళ కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా పండుగ ఏర్పాట్లలో ఉండగా.. అగ్ని ప్రమాదం సంభవించి.. వారిని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో గ్రామంలో 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో నష్టం మరింత తీవ్రమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. పండగ పూట తీవ్ర విషాదం కాకినాడ, సార్లంక […]
Date : 13-01-2026 - 10:39 IST -
#Andhra Pradesh
కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు
Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపారం ఏటా రూ.5 కోట్లకు చేరుకుంటుంది. కోడి పందేలకు […]
Date : 12-01-2026 - 12:42 IST -
#Andhra Pradesh
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు
Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు కొంత మేర ఊరట కలుగుతుందని […]
Date : 10-01-2026 - 3:00 IST -
#Andhra Pradesh
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్
Songa Roshan Kumar చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్, జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై అనుచరులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా ఉన్న ఈ రహదారి అందాలను ఆస్వాదిస్తూ ఈ రీల్ చేశారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ హైవే నిర్మాణం పూర్తయింది, ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఈ హైవేపైకి వాహనాలను అనుమతించాలని భావిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్ […]
Date : 10-01-2026 - 11:42 IST