HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Budget Today

నేడు ఏపీ బడ్జెట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 14-02-2026 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Budget 2026–27
Ap Budget 2026–27

Budget 2026 – 27  నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ఉదయం 11.15 నిమిషాలకు ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ దాదాపు రూ.3.46 లక్షల కోట్లతో ఉండొచ్చంటున్నారు. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీాగా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్.. దాదాపు రూ.3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండొచ్చంటున్నారు. ఇవాళ ఉదయం ఏపీ కేబినెట్ ఉదయ 10.30 గంటలకు సమావేశం అవుతుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఉదయం 11:15 నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెడతారు.. ఆ తర్వాత వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ సమర్పిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి అనిత.. వ్యవసాయ బడ్జెట్‌ను రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయసభలూ వాయిదా వేస్తారు.. ఈ నెల 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలుపుతారు.

2025-26లో బడ్జెట్ రూ.3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు.. అది ఈసారి రూ.3.46 లక్షల కోట్ల వరకు ఉంటుందంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయంటున్నారు. అలాగే పోలవరం, అమరావతి, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మూడు ఆర్థిక జోన్లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుంది అంటున్నారు. 16వ ఆర్థికసంఘం గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని నిధులివ్వాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర పన్నుల్లో వాటా మరింత పెరుగుతుంది అంటున్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా రాష్ట్రానికి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టాలని భావిస్తోంది. గతంతో పోలిస్తే ఈ జనవరి నెలాఖరు 4శాతం అదనంగా రాబడి వచ్చింది.

ఈసారి బడ్జె్ట్‌లో పోలవరం, అమరావతికి కూడా ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. పోలవరంతో పాటుగా మిగిలిన సాగునీటి ప్రాజెక్టుల్ని ప్రాధాన్యక్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రాజెక్టుల నిర్వహణకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు రూ.35వేల కోట్లు అవసరమవుతాయి.. ఆ మేరకు కేటాయింపులు ఉంటాయంటున్నారు. మిగిలిన సంక్షేమ పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 14 February
  • Andhra Pradesh Budget
  • Andhrapradesh
  • Andhrapradesh CM
  • andhrapradesh news
  • andhrapradesh politics
  • ap assembly
  • AP Assembly Session
  • AP CM Chandrababu
  • Budget 2026
  • Budget 2026 - 27

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd