AP CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మూడు కుటుంబాలను ఎంపిక చేసి, వారికి రూ. 5,000 చొప్పున […]
Date : 07-07-2026 - 1:02 IST -
#Andhra Pradesh
Amaravati Vs MAVIGUN: వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్ జగన్ సవాల్..!
ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Date : 01-07-2026 - 3:06 IST -
#Andhra Pradesh
AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంది.. రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో ఉంది. గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి. తాజాగా మరో ప్రముఖ కంపెనీ అడిడాస్ సంస్థకు షూస్ తయారు చేసి సరఫరా చేసే హ్వాసెంగ్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హ్వాసెంగ్ అడిడాస్‌కు షూస్ సప్లై చేయడంలో ప్రధాన భాగస్వామిగా ఉంది. హ్వాసెంగ్‌కు ప్రస్తుతం చైనా, వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియాలో […]
Date : 30-06-2026 - 10:09 IST -
#Telangana
ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !
కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను ఆపాదించుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టంగా వెల్లడైంది. ఈ యువతీ యువకులు సమావేశాలకు […]
Date : 20-06-2026 - 5:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీలో నాలుగు శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం కేంద్రం పీఎం విద్యాలక్ష్మి పథకం కింద రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు […]
Date : 20-06-2026 - 11:42 IST -
#Andhra Pradesh
CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్రలపై సీఎం ఫైర్
రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తుంటే, గత పాలకులు విధ్వంసక రాజకీయాలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు అన్నారు. సుపరిపాలనను వెనక్కి లాగేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని.. అందుకే ఆ పార్టీని “గొడ్డలి […]
Date : 01-06-2026 - 4:03 IST -
#Andhra Pradesh
AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోక చెక్క వంటి ఉద్యాన పంటల ద్వారా లభించే పీచు, నార, ఫైబర్‌కు విలువ జోడించి రైతులకు అదనపు […]
Date : 29-05-2026 - 10:52 IST -
#Andhra Pradesh
Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “జై తెలుగుదేశం” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగగా, చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. యుద్ధ […]
Date : 27-05-2026 - 11:55 IST -
#Andhra Pradesh
Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం […]
Date : 25-05-2026 - 11:18 IST -
#Andhra Pradesh
టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్ రగడ
TDP vs JanaSena అధికార కూటమి ఘనవిజయం సాధించిన కొన్ని రోజులకే పిఠాపురంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ఇటీవలే జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. దొరబాబు ఒక వైసీపీ కోవర్టు అని, కూటమిలో గొడవలు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని వర్మ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ […]
Date : 22-04-2026 - 12:50 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్
Amaravati కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ఖరారు చేసింది. ఇంతలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై కొన్ని సూచనలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారు. అలా చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు. Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in […]
Date : 14-04-2026 - 10:32 IST -
#Andhra Pradesh
AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు
Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ […]
Date : 02-04-2026 - 11:45 IST -
#Andhra Pradesh
ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది… నిరుద్యోగులకు పండగ…!!
AP Job Calendar ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ తన X ఖాతాలో 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 4 విడతల్లో, 41 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నోటిఫికేషన్ల విడుదల కోసం […]
Date : 20-03-2026 - 11:21 IST -
#Andhra Pradesh
అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!
58 Feet Bronze Potti Sriramulu Statue తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 […]
Date : 16-03-2026 - 2:28 IST -
#Andhra Pradesh
ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!
Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్‌కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది. అధునాతన టెక్నాలజీ, పర్యావరణహితమైన పద్ధతుల్లో ఇక్కడ ఏటా లక్షల టన్నుల […]
Date : 12-03-2026 - 5:00 IST