World
-
Iraq : తూర్పు బాగ్దాద్ లో భారీ పేలుడు, 10మంది ఫుట్ బాల్ ఆటగాళ్లు మృతి, 20మందికి గాయాలు..!!
ఇరాక్ లోని తూర్పు బాగ్దాద్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది మరణించారు. 20 మందిపైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ స్టేడియం , కేఫ్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మరణించినవారంతా ఫుట్ బాల్ ఆడినవారేనని భద్రతా అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి. అయితే పేలుడు కు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. 10 killed, 20+ wounded in an explosion in east Baghdad, Iraq 🇮🇶 […]
Date : 30-10-2022 - 5:29 IST -
South Korea : దక్షిణకొరియాలో పెను విషాదం, హాలోవీన్ పార్టీలో తొక్కిసలాట, 149మంది మృతి..!!
దక్షిణకొరియాలో పెను విషాదం నెలకొంది. శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని సియోల్ లో జరిగిన హాలోవీన్ పార్టీకి పెద్దెత్తున ప్రజలు హాజరయ్యారు. ఒక్కసారిగా భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో డజన్ల కొద్దీ జనాలు ఊపిరిపీల్చుకోలేక అపస్మారక స్థితిలో రోడ్లపై పడిపోయారు. ఇరుకైన వీధిలోకి దాదాపు లక్షమంది ఒకేసారి రావడంతో ఊపీరిపీల్చుకునేేందుకు ఇబ
Date : 30-10-2022 - 5:17 IST -
UK : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. వారానికి 4 రోజులు డ్యూటీ, 3 రోజులు సెలవు.. జీతం మాత్రం!!
ఉద్యోగుల బాగు కోరుకునే కంపెనీ…ఎప్పటికీ అభివ్రుద్ధిలోనే ఉంటుంది. ఉద్యోగులు బాగుంటేనే కదా..కంపెనీ బాగుండేది. అందుకే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీల ఉద్యోగుల శ్రేయస్సుపై ద్రుష్టిసారించాయి. పని విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకుండా…వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పిస్తున్నాయి. అయితే లండన్ కు చెందిన ఓ ఇంధన కంపెనీ…తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కేవలం 4రోజులు మా
Date : 29-10-2022 - 7:23 IST -
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానికి విచిత్ర అనుభవం..!!
బ్రిటన్ ప్రధాని రిషిసునక్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు సౌత్ లండన్ లోని క్రోయిడన్ హస్పిటల్ కు వెళ్లారు. ఓ రోగిని ఇక్కడి సిబ్బంది బాగా చూసుకుంటున్నారా అని అడిగారు. ఆ రోగి సమాధానం ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చే జీతాలు వారికి సరిపోవడం లేదు..వారిని చూస్తే జాలేస్తోంది అన్నారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ ను బలోపేతం చేయడంతోపాటు నర్సుల జీ
Date : 29-10-2022 - 7:04 IST -
Philippines : ఫిలిప్పీన్స్ ను ముంచెత్తుతున్న వరదలు. 42 మంది మృతి!!
ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ప్రావిన్స్ లో కురిసిన భారీవర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో 42 మంది మృతిచెందారు. మరో 16మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రావిన్స్ లో వరద పరిస్థితి దారుణంగా ఉందని..దీంతో ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. మాగ్విండనావో ప్రావిన్స్ లోని మూడు నగరాలు వరదధాటికి ఎక్కువగా ప్రభ
Date : 29-10-2022 - 6:20 IST -
America : ఉత్తర అమెరికాలో శ్రీవేంకటేశ్వరస్వామి గోపురం ప్రారంభం..!! సంతోషంలో హిందువులు..!!
ఈ ఏడాది దీపావళి పండగను పురస్కరించుకుని అమెరికాలోని నార్త్ కరోలినాలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన 87అడుగుల గోపురంను ప్రారంభించారు. వందలాదిమంది భక్తుల సమక్షంలో ఈ గోపురాన్ని నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ ప్రారంభించారు. గోపురం ప్రారంభోత్సవంతో అక్కడున్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గేట్‌వే టవర్‌కి ‘టవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రోస్పెరిటీ’ అని పే
Date : 29-10-2022 - 5:07 IST -
Tiny Skeleton: 166 మిలియన్ ఏళ్ల నాటి బల్లి అస్థిపంజరం లభ్యం..!
స్కాట్‌లాండ్‌లో 166 మిలియన్ సంవత్సరాల నాటి బల్లి శిలాజం బయటపడిందని..
Date : 28-10-2022 - 6:33 IST -
Twitter : ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్…సీఈవో కు ఉద్వాసన..!!
ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం మొత్తానికి పూర్తయ్యింది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. 44కోట్ల డాటర్లతో ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు మస్క్. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న అనంతరం ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సీఎఫ్ ఓ తోపాటు పలు విభాగాలకు చెందిన అధిపతలుకు ఉద్వాసన పలికారు. కాగా ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఏదొ
Date : 28-10-2022 - 8:18 IST -
Elon Musk : ఇదీ సంగతి… ట్విట్టర్ ను కొనుగోలు చేయడానికి అసలు కారణం చెప్పిన మస్క్..!!
ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్…ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పేశారు. ఈ ఒప్పందం వెనకున్న అసల నిజాన్ని బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్లో గురువారం ఓ పోస్టు జోడించారు. ఈ పోస్టులో ఫ్లాట్ ఫారమ్ పై ప్రకటనల గురించి తాను ఏమనుకుంటున్నాడో చెప్పారు. నేను ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశాను..అనేదానిపై చాలా ఊహాగానాలు వచ్చాయని..అయితే వాటిలో చాల
Date : 28-10-2022 - 8:06 IST -
US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం..మరో 5గురికి తీవ్రగాయాలు..!!
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ మసాచూసెట్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రేమ్ కుమార్ రెడ్డి (27) పావని గుళ్లపల్లి (22)సాయి నరసింహా పాటం శెట్టి (22) అక్కడిక్కడే మరణించినట్లు బెర్క్ షైర్ జిల్లా కార్యాలయం గురువారం తెలిపింది. మాసాచుసెట్స్ పోలీసులు తెల
Date : 28-10-2022 - 6:51 IST -
Italy: సూపర్‌మార్కెట్‌లో కత్తితోదాడి.. ఒకరు మృతి. ఫుట్‌బాల్ స్టార్ సహా నలుగురికి గాయాలు..!!
ఇటలీలోని మిలాన్ లోని ఓ సూపర్ మార్కెట్లో దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆర్సెనల్ ఫుట్ బాల్ ఆటగాడు పాబ్లో మారి కూడా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో అతను షాపింగ్ చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానిక మీడియా ప్రకారం…గురువారం సాయంత్రం 6.30గంటలకు మిలానో ఫియోడి డి అస్సాగ
Date : 28-10-2022 - 5:28 IST -
Dirty Bomb Claim: రష్యా-ఉక్రెయిన్.. డర్టీ బాంబ్ టెన్షన్..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా మారబోతోందా..?
Date : 27-10-2022 - 10:41 IST -
Khamenei : షియా మసీదుపై దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి…దేశప్రజలంతా ఏకం కావాలని విజ్ఞప్తి..!!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఇరాన్ లో షియా మసీదుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దేశ భద్రతతో ఆడుకునే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రకటించారు. దాడి చేసిన వారికి కచ్చితంగా శిక్షపడుతుందని స్థానిక మీడియాతో తెలిపారు. ఇదే దేశ శత్రువుల కుట్రగా పేర్కొంటూ ప్రజలంతా ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. కాగా బుధవారం షిరాజ్ నగరంలోని ష
Date : 27-10-2022 - 7:31 IST -
Astrazeneca COVID Vaccine: ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ ప్రమాదకరం..!
ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ అరుదైన రక్తం గడ్డకట్టే పరిస్థితికి ఎక్కువ ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది.
Date : 27-10-2022 - 7:09 IST -
NATA Meeting : డల్లాస్ లో నాటా బోర్డు సమావేశం.. నిధుల సేకరణ కు విశేష స్పందన
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ (నాటా ) బోర్డు సమావేశం జరిగింది.
Date : 27-10-2022 - 8:41 IST -
Pakistan PM Shehbaz: చైనాలో పర్యటించనున్న పాక్ ప్రధాని.. ఎప్పుడంటే..?
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే వారంలో చైనాలో పర్యటించనున్నారు.
Date : 26-10-2022 - 11:51 IST -
Twitter Deal: మరో రెండు రోజుల్లో ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి..!
ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది.
Date : 26-10-2022 - 8:18 IST -
Indonesia Boat Fire: 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు.. 14 మంది సజీవదహనం.!!
ఇండోనేషియాలో విషాదం నెలకొంది. దక్షిణ ఇండోనేషియాలో 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు చెలరేగాయి.
Date : 26-10-2022 - 4:16 IST -
Fire at Blind School: పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంధ విద్యార్థులతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని స్థానిక జిల్లా అధికారి తెలిపారు. కుటుంబీకుల సహాయంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
Date : 25-10-2022 - 6:58 IST -
UK PM Rishi Sunak: ప్రధాని రిషి సునాక్ సంచలన వ్యాఖ్యలు.. ప్రజల కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాం..!
బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.
Date : 25-10-2022 - 5:45 IST