Trump Daughter Wedding: ఘనంగా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె వివాహం..వైరల్ ఫొటోలు..!!
- Author : hashtagu
Date : 13-11-2022 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ వివాహం ఘనంగా జరిగింది. పేజ్ సిక్స్ ప్రకారం ట్రంప్ ఫ్లోరిడా నివాసం మార్ ఎ లాగోలో ఆదివారం ఈ వివాహం జరిగింది. టిఫనీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లాడింది. ట్రంప్ టిఫినీ చేయి పట్టుకుని మైఖేల్ బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను కిందికి నడిపించాడు. పెవిలియన్ నీలం, గులాబీ, తెలుపు పూలతో అలంకరించారు. టిఫనీ మైఖేల్ ఒకరినొకరు మనువాడారు. టిఫనీ ఎలీ సాబ్ డిజైన్ చేసిన లాంగ్ స్లీవ్ పెర్ల్ వెడ్డింగ్ గౌను ధరించింది. ఆ గౌనులో టిఫనీ ట్రంప్ దేవకన్యాల మెరిసిపోయింది. మెలానియా, ఇవాంక, ఎరిక్ మరియు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వివాహానికి హాజరయ్యారు.
Donald Trump's daughter Tiffany marries beau Michael Boulos
Read @ANI Story | https://t.co/6GNqOkxQf2#DonaldTrump #TiffanyTrumpwedding #MichaelBoulos pic.twitter.com/3oGQoUPh8X
— ANI Digital (@ani_digital) November 13, 2022
స్వాగత విందును శుక్రవారం నిర్వహించనున్నారు. నికోల్ హరికేన్ కారణంగా పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. దీంతో అన్ని విమానాలు రద్దు అయ్యాయి. అతికొద్ద మంది అథితుల సమక్షంలోనే వివాహం జరిగింది. వివాహా రిసెప్షన్ కు 500 మంది అతిథులు హాజరు కానున్నారు. టిఫనీ పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించాలనుకున్నా తుఫాను కారణంగా కుదరలేదు. టిఫనీకి కాబోయే భర్త మైఖేల్ బోలోస్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుండి తమ స్నేహితులు హాజరు కావాలని ఇద్దరూ కోరుకున్నప్పటికీ కుదరలేదు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.



