HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Good News Iran Gives Green Signal To Indian Ships

Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hormuz route opened for India
Hormuz route opened for India

Iran పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత దేశ నౌకలకు హార్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా తమ మిత్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాక్‌లకు కూడా ఈ అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. దీంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత నౌకలు త్వరలోనే సరుకుతో సహా తమ గమ్యస్థానాలకు చేరేందుకు మార్గం సుగమమైంది.

అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించింది. తమ మిత్ర దేశాలైన భారత్ సహా ఐదు దేశాల నౌకల రాకపోకల కోసం ఈ మార్గాన్ని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.

మిత్ర దేశాలకు ప్రత్యేక అనుమతులు..

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా సదరు జలసంధిని మూసివేసి కొన్ని దేశాల నౌకలను వెళ్లనీయకుండా అడ్డుకుంటోంది. అయితే తాజాగా భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌లకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. “మా మిత్ర దేశాల నౌకలు హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం” అని అరాగ్చీ పేర్కొన్నట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగే దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు తెలిపింది.

చిక్కుకుపోయిన భారత నౌకలకు మార్గం సుగమం..

ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన భారత వాణిజ్య నౌకలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు మార్గం సులువైంది. ముఖ్యంగా భారత్‌కు వస్తున్న ఐదు గ్యాస్ ట్యాంకర్లు అనుమతుల కోసం గత కొంతకాలంగా వేచి చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా ఉత్తర్వులతో ఈ ట్యాంకర్లు సురక్షితంగా భారత్ చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయంగా ఇంధన సరఫరాలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

హార్మూజ్ దాటే నౌకలపై టోల్ రుసుము విధించే అవకాశం

మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ రుసుము విధించే అంశంపై ఇరాన్ పార్లమెంట్ కసరత్తు చేస్తోంది. ‘బ్లూమ్‌బెర్గ్’ కథనం ప్రకారం.. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ న్యూస్‌ను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నౌకల నుంచి టోల్ వసూలు చేయడంతో పాటు దానికి బదులుగా ఆయా నౌకలకు ఇరాన్ రక్షణ కల్పిస్తూ జలసంధిని దాటించనుంది. సముద్రపు దొంగల ముప్పు లేదా ఇతర అంతర్జాతీయ ఉద్రిక్తతల నుంచి వాణిజ్య నౌకలను కాపాడేందుకు ఇరాన్ ఈ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనుంది. మరి ఏ దేశాలకైనా వెసులుబాటు కల్పిస్తుందా.. లేక అన్ని దేశాల నౌకలపై ఈ టోల్ రుసుము వసూలు చేస్తుందా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Battle for Crude Oil
  • Brent crude
  • Crude Oil Imports
  • crude oil imports India
  • Hormuz Route
  • india
  • Indian oil companies
  • Iran
  • Iran Vs Israel
  • Middle East
  • oil
  • Vessels

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • India Russian Oil Imports

    Russian oil: గుడ్ న్యూస్.. రష్యా నుండి భారత్‌కు 60 మిలియన్ బ్యారెళ్ల చమురు…

  • Pakistan Economy Crisis

    Pakistan Economy Crisis: పాకిస్థాన్‌లో చమురు మంటలు.. రికార్డు స్థాయిలో ఇంధన ధరలు

  • Trump Retaliatory Tariffs To Be Suspended From Tomorrow

    Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్..అసలు ఏంజరిగిందంటే !

Latest News

  • BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్… నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • Putin: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన పుతిన్.. రష్యా నుంచి ఇరాన్‌కు డ్రోన్లు..

  • Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజ‌య్ మాల్యా

Trending News

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd