Andhrapradesh
-
#Telangana
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ నేత రోజా
Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా ఢిల్లీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంటు భవనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు తారసపడ్డారు. రోజాను పలకరించిన రేవంత్ రెడ్డి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో వెంట ఉన్న నాయకులు […]
Date : 18-03-2026 - 2:45 IST -
#Devotional
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది […]
Date : 18-03-2026 - 12:00 IST -
#Andhra Pradesh
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ నివాసంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కఠారి ఈశ్వర్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటుండగా, ఆయన భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదయం ఆమె తిరిగి గుడివాడలోని ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఆమె గమనించారు. లోపలికి […]
Date : 18-03-2026 - 11:24 IST -
#Andhra Pradesh
ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్‌లైన్లో పోటీ పరీక్ష
Andhra Pradesh ఇంటర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఓ అధ్యాపకుడు అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో తమ ప్రతిభను పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన లెక్చరర్ రెళ్లా రెడ్డప్ప ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన mpcexams.com పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ […]
Date : 18-03-2026 - 10:17 IST -
#Andhra Pradesh
విద్యాశాఖ సూపర్.. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు
AP Education Minister Nara Lokesh ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర బృందం కొనియాడింది. లోకేష్ ఐటీ, విద్యాశాఖ […]
Date : 17-03-2026 - 2:49 IST -
#Andhra Pradesh
ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో […]
Date : 17-03-2026 - 11:29 IST -
#Andhra Pradesh
అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!
58 Feet Bronze Potti Sriramulu Statue తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 […]
Date : 16-03-2026 - 2:28 IST -
#Speed News
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్‌గా మార్చింది. ఈ మేరకు కేంద్ర […]
Date : 14-03-2026 - 10:53 IST -
#Andhra Pradesh
విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్!
మంత్రి లోకేశ్ ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టింది. విద్యార్థిని అడిగిన వెంటనే నిధులు మంజూరు కావడంతో ఏకంగా రూ.18 లక్షల వ్యయంతో CC రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
Date : 13-03-2026 - 8:12 IST -
#Andhra Pradesh
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
AP Funds కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా […]
Date : 13-03-2026 - 3:00 IST -
#Andhra Pradesh
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Tirumala Laddu తిరుమల లడ్డూకు వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరుతూ మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలపై ప్రస్తుతానికి తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. […]
Date : 13-03-2026 - 2:24 IST -
#Andhra Pradesh
ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!
Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్‌కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది. అధునాతన టెక్నాలజీ, పర్యావరణహితమైన పద్ధతుల్లో ఇక్కడ ఏటా లక్షల టన్నుల […]
Date : 12-03-2026 - 5:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!
Nara Lokesh ఏపీ పారిశ్రామిక రంగంలో మరో సంచలనం నమోదు కాబోతోంది. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాదు.. సెక్యూరిటీ, షిప్ బిల్డింగ్ రంగాల్లోనూ ఏపీ సత్తా చాటుతోంది. కూటమి ప్రభుత్వ చొరవతో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఏర్పాటు కాబోతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఏపీని అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలన్న సీఎం […]
Date : 12-03-2026 - 12:18 IST -
#Andhra Pradesh
చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!
Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా ‘గణాంకాలతో కూడిన రేటింగ్స్’ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది. ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు […]
Date : 12-03-2026 - 12:10 IST -
#Andhra Pradesh
కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు
Ap Cm Chandrababu Naidu టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సాధికార సారథుల్ని నియమించిన సంగతి తెలిసిందే. 2023లో చంద్రబాబు వీరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా సామాన్య కార్యకర్తలా కుటుంబ సాధికార సారథి బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన పేరును కుటుంబ సాధికార సారథిగా.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో నమోదు చేశారు. ఆయనకు మొత్తం 60 కుటుంబాల బాధ్యతల్ని అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ కుటుంబ సాధికార సారథుల […]
Date : 12-03-2026 - 11:10 IST