HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Power Supply To The Vijayawada Durga Temple Has Been Suspended

విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!

  • Author : Vamsi Chowdary Korata Date : 27-12-2025 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Durga Temple
Durga Temple

Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు.. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో మూడు గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు సమాచారం.

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం.. విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.

జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. దీంతో మూడు గంటల అనంతరం విజయవాడ దుర్గ గుడికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ బిల్లు చెల్లించలేదంటూ ఏపీసీపీడీసీఎల్.. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేసింది. 2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి దేవస్థానం కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ బకాయిలు సుమారుగా రూ.3.08 కోట్లు ఉన్నట్లు సమాచారం. విద్యుత్ బకాయిలు చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ.. దేవస్థానం నుంచి స్పందన లేదని ఏపీసీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. దీంతో శనివారం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్తున్నారు.

దుర్గ గుడి అధికారుల స్పందన
అయితే ఈ ఘటనపై విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధికారుల స్పందన మరోలా ఉంది. దుర్గ గుడి అవసరాలకు తాము సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే కరెంట్ వాడుతున్నట్లు చెప్తున్నారు. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కోరామని.. అయితే వారు ఈ ఏర్పాటు చేయలేదని చెప్తున్నారు. దీంతో సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ లెక్కలు తేలటం లేదంటున్నారు.

అప్పారావుపేట, పాముల కాలువ వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రెండేళ్లుగా ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని.. బదులుగా విద్యుత్ శాఖ దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తోందన్నారు. ఈ సర్వీసులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు.

మరోవైపు దుర్గ గుడి దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సంప్రదింపుల తర్వాత మూడు గంటల అనంతరం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే దుర్గ గుడికి కరెంట్ సరఫరా నిలిపివేయటంపై భక్తులు మండిపడుతున్నారు. కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • durgamma temple vijayawada
  • Electricity Bills Issue
  • Kanaka Durga Temple
  • power supply

Related News

Amaravati Capital

AP Assembly: అమరావతికి చట్టబద్ధత

Andhra Pradesh CM Chandrababu Naidu  రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది.  ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని  అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు  ప్రతిపాదన చేశారు .  అయితే,  ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్‌పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు.  జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును ప

  • Loan App Harassment Kakinada

    Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

  • Father Kills Daughters Markapuram

    Markapuram: ప్రియురాలి కోసం కన్న కూతురిని హతమార్చిన తండ్రి

  • National Highway

    National Highway: ఏపీలో మరో నేషనల్ హైవే

  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

Latest News

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

  • AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

  • Dog : రూ.5 బిస్కెట్ తో 130 కి.మీ పాదయాత్ర చేసిన శునకం..ఇది కదా విశ్వాసం అంటే !!

  • IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

  • Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd