HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chief Minister Chandrababu Naidu Says No State Is Close To Ap

ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 21-02-2026 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Naidu
Chandrababu Naidu

 

ChandraBabu  సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ రథాన్ని’, ఈ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.

దేశంలోనే ఏపీ అగ్రగామి
ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. “దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నాం. మొదటి తారీఖునే పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నాను. ‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆర్థిక సాయం అందిస్తున్నాం. ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం” అని వివరించారు.

మహిళా సాధికారత, ప్రజల భాగస్వామ్యం
మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. “స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. వారు ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్ష మంది మహిళలను ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దుతున్నాం” అని పేర్కొన్నారు. పీ4 కార్యక్రమం కింద ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని, వారికి మార్గనిర్దేశం చేసేందుకు లక్ష మంది మార్గదర్శులు ముందుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 561 స్వయం సహాయక సంఘాలకు రూ.100.14 కోట్ల చెక్కును అందించారు.

టెక్నాలజీతో సుపరిపాలన
పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. “దేశంలో ఏ రాష్ట్రం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందించడం లేదు. త్వరలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శిక్షణ ఇచ్చేందుకు ఏఐ ట్యూటర్‌ను తీసుకువస్తున్నాం. ఇటీవల బిల్ గేట్స్ కూడా రాష్ట్రానికి వచ్చి రైతులు టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేశారు” అని గుర్తుచేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.

ఆరోగ్యానికి భరోసా, వ్యవసాయానికి చేయూత
ప్రజల ఆరోగ్యం కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని ప్రవేశపెట్టి సాగును సులభతరం చేస్తామన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెట్ ధర అందేలా, సాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినుకొండను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు.

స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా పటిష్ట చర్యలు
స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే ‘స్వచ్ఛాంధ్ర’ లక్ష్యమని సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోందన్నారు. “గత పాలకులు వదిలేసిన 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే బృహత్తర కార్యక్రమం చేపట్టాం. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ పూర్తి చేస్తాం” అని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామని, దీనివల్ల పశువులు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని వివరించారు.

చెత్త నుంచి సంపద.. మారాల్సిన తీరు
చెత్తను సంపదగా మార్చే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. “విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. రాజమండ్రితో పాటు మరో 5 ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా కుటుంబాలు హోం కంపోస్టింగ్ ద్వారా ఎరువు తయారు చేసుకుంటున్నాయి” అని ప్రశంసించారు. చెత్త నిర్వహణలో జపాన్ పౌరుల తరహాలో మన ఆలోచనా తీరు మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture Technology
  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • AP welfare schemes
  • Mahila Sadhikarata
  • NTR Bharosa Pension
  • NTR Bharosa Pension Scheme
  • Super Six
  • Swachh Andhra
  • Technology Governance
  • Universal Health Policy

Related News

Local elections in AP: Alliance aims for victory.

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వేడితో వేడెక్కుతోంది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ (SEP/OCT) నెలల్లోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, భార

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd