Andhra Pradesh
-
#India
Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!
దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ వినియోగం కూడా పెరుగుతోంది. దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు […]
Date : 22-11-2025 - 4:05 IST -
#Andhra Pradesh
Nellore : భార్య ముందే ప్రియురాలి కోసం భర్త ఆత్మహత్యాయత్నం!
నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. భార్య ముందే ప్రియురాలి కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఓ యువకుడు. ప్రియురాలిని తన ఊరికి తెచ్చుకున్నాక, ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లడంతో తట్టుకోలేక ఈ ఘోరం చేశాడు. చివరికి భార్య అతన్ని కాపాడింది. నెల్లూరు జిల్లా కలిగిరిలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రియురాలి కోసం భార్య ముందు ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు.. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ […]
Date : 22-11-2025 - 2:13 IST -
#Andhra Pradesh
Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలలో ఒక్క టీఎంసీ నీరు కోల్పోయినా.. అందుకు టీడీపీ ప్రభుత్వమే […]
Date : 21-11-2025 - 4:25 IST -
#Andhra Pradesh
SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!
అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల […]
Date : 21-11-2025 - 3:07 IST -
#Andhra Pradesh
AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!
పారిశ్రామిక అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్, స్కై ఫ్యాక్టరీ, గిన్ఫ్రా ప్రెసిషన్, సుగ్నా స్పాంజ్ పవర్ వంటి కంపెనీలు.. భారీ పెట్టుబడులుతో యూనిట్లను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. కాగా, ఏడాదిన్నర కాలంలోనే అనంతపురం జిల్లాలో రూ. 4,194 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా […]
Date : 21-11-2025 - 11:59 IST -
#Andhra Pradesh
New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సచివాలయాల్లోనే కొత్త కార్డుల జారీ, పిల్లల పేర్లు చేర్చడం, చిరునామా మార్పు వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారికి ఆధార్, పెళ్లి ధ్రువపత్రంతో సులభంగా రేషన్ కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరే పూర్తవుతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులపై ఎన్నో అనుమానాలు […]
Date : 21-11-2025 - 10:49 IST -
#Devotional
Tirumala : ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు..!
తిరుమల శ్రీవారికి అలంకరించిన పూలమాలలతో టీటీడీ అగరబత్తీలను తయారు చేస్తోంది.తందనాన, దివ్యపాద వంటి ఏడు రకాల పేర్లతో లభిస్తున్న ఈ అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వ్యర్థాలను తగ్గించి, పవిత్రతను పెంచే ఈ ఉత్పత్తి ద్వారా నెలకు రూ. 4-5 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నై, బెంగళూరులోని ఆలయాల్లో కూడా ఈ అగరబత్తీలు లభిస్తున్నాయి. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.అయితే భక్తుల కోసం కలియుగ […]
Date : 21-11-2025 - 10:21 IST -
#Andhra Pradesh
Annadata Sukhibhava : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద రూ.5000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్తం రూ.7000 […]
Date : 19-11-2025 - 4:55 IST -
#Andhra Pradesh
Anand Mahindra : చంద్రబాబు అన్‌స్టాపబుల్..ఆనంద్ మహీంద్రా సంచలనం..!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు.. ఆటోమేటిక్ ఎస్క్రో ఖాతా, ప్రోత్సాహకాల విడుదల, సావరిన్ గ్యారంటీ వంటి విధానాలు వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని రీపోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు విజన్, విధానాల్లో కొత్తదనం తనకు ఎప్పుడూ ప్రేరణనిస్తాయని ట్వీట్ చేశారు. చంద్రబాబు తనతో పాటు తన చుట్టూ ఉన్నవారి […]
Date : 19-11-2025 - 4:13 IST -
#Andhra Pradesh
Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీలో కూడా శెట్జి బలిజల్ని ఓసీల్లో చేరుస్తారనే ప్రచారం జరుగుతోందని రెండు నెలల క్రితం మంత్రి ప్రస్తావించారు. అది వైఎస్సార్సీపీ నేతల అబద్ధపు ప్రచారమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ […]
Date : 19-11-2025 - 2:41 IST -
#Andhra Pradesh
Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి మరోసారి దద్దరిల్లింది. బుధవారం (నవబంర్ 19) పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత […]
Date : 19-11-2025 - 11:26 IST -
#Andhra Pradesh
Tirumala Tirupathi Devasthanam : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్నెరవేరబోతున్న కల..!
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాల నిర్మాణం 75% పూర్తయింది. దాదాపు పదివేల మందికి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుతో పాటు, అలిపిరి సమీపంలోనూ కొత్త వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో భక్తుల వసతి సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఈ రెండు సముదాయాలు అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు గదుల సమస్యలు ఉండవని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు […]
Date : 19-11-2025 - 11:02 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఏరో స్పేస్ క్యాంపస్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. […]
Date : 18-11-2025 - 5:19 IST -
#Andhra Pradesh
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా […]
Date : 18-11-2025 - 12:02 IST -
#Andhra Pradesh
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది హతమైనట్లు […]
Date : 18-11-2025 - 11:31 IST