HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Movie Scene Repeat In Disguise Of Guntur Government Hospital

Superintendent : సినిమా సీన్ రిపీట్..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో!

  • Author : Vamsi Chowdary Korata Date : 26-11-2025 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guntur Government Hospital
Guntur Government Hospital

ప్రముఖ నటుడు జగపతిబాబు నటించిన ‘అధినేత’ సినిమాలోని ఆసుపత్రి సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి సీన్ గుంటూరు జీజీహెచ్‌లో రిపీట్ అయింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ.. పల్లెటూరు వృద్ధుడి వేషంలో పంచె, మాసిన దుస్తులు, చేతికర్ర పట్టుకుని ఇద్దరు అసిస్టెంట్లతో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రివేళ వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఇటీవల విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన గుర్తించారు.

ప్రముఖ నటుడు జగపతిబాబు నటించిన ‘అధినేత’ సినిమాలో ఆసుపత్రి సీన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఆ సీన్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. జగపతిబాబు అందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు. ఈ క్రమంలో గర్భవతి అయిన తన భార్యను సీఎం.. మారువేషంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ధోతి, బనియన్ వేసుకుని పల్లెటూరు మనిషిలా కనిపిస్తారు. దీంతో ఆయన్ను చూసి ఆసుపత్రిలో కంపౌండర్ దగ్గరి నుంచి వైద్యురాలి వరకు డబ్బులు ఇష్టారీతిన వసూలు చేస్తారు. చివరికి వచ్చింది పల్లెటూరు భార్యాభర్తలు కాదు.. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, లేడీ అధికారి అని తెలిసి ఆసుపత్రి సిబ్బంది అంతా షాక్ అవుతారు. అచ్చం ఇలాంటి సీన్.. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (జీజీహెచ్) రిపీట్ అయ్యింది.

గత కొంత కాలంగా గుంటూరు జీజీహెచ్‌పై విమర్శలు వస్తున్నాయి. రాత్రివేళ ఆర్‌ఎంవోలు, వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రమణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం (నవంబర్ 25) రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు అసిస్టెంట్లను వెంటపెట్టుకుని ఓ వృద్ధుడి వేషంలో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. చింపిరి జట్టు, చేతిలో కర్ర, పాతచొక్కా, మాసిన కండువా ధరించారు. ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్‌ వేసుకున్నారు.

ఆసుపత్రిలో తనకు వైద్యం చేయాలంటూ అక్కడి వైద్యులు, సిబ్బందిని సూపరింటెండెంట్ అభ్యర్థించారు. దీంతో ఆయన్ను చూసిన వైద్యులు.. కొన్ని టెస్ట్‌లకు రిఫర్‌ చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని పలు డిపార్ట్‌మెంట్‌ల వద్దకు వెళ్లి పరిస్థితిని గమనించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వరండాల్లో వీధి కుక్కలు తిరుగుతూ కనిపించాయి. ఇక ఐసీయూల వద్ద సిబ్బంది చెబుతున్న సమాధానాలను స్వయంగా విన్నారు. ఫార్మసీ వద్ద పరిస్థితిని సూపరింటెండెంట్ గమనించారు.

ఇలా గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ తనిఖీలు చేశారు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ. తనిఖీల్లో ఆసుపత్రిలో ఉన్న కొన్ని లోపాలు ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు సమాచారం. విమర్శలపై సూపరింటెండెంట్‌ ఈ విధంగా స్పందించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం స్వయంగా ఆయనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించడాన్ని అభినందిస్తున్నరు.

ఇంతకుముందు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కలెక్టర్ వినోద్ కుమార్ ఇలాగే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖానికి మాస్క్ ధరించి భుజంపై టవల్ వేసుకుని సాధారణ వ్యక్తిలా కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది వద్దకు వెళ్లి.. అనంతపురం వెళ్లడానికి ఎంత తీసుకుంటారు? అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • guntur
  • Guntur GGH Hospital
  • Guntur Government Hospital
  • Superintendent

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

Latest News

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd