HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Rs 6 Thousand In The Accounts Of Ap Farmers Good News From Atchannaidu

Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

  • By Vamsi Chowdary Korata Published Date - 10:38 AM, Wed - 26 November 25
  • daily-hunt
Annadata Sukhibhava
Annadata Sukhibhava

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సూచించారు.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తీపికబురు చెప్పారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇటీవల విడుదల చేయగా.. తాజాగా మూడో విడత నిధుల విడుదలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత లబ్ధిని ఫిబ్రవరిలో అందిస్తామని తెలిపారు. ఈ నెల 21న రెండో విడత కింద రూ.7వేలు చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతలో రూ.6వేలు రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు జమ చేస్తోంది.. అందులో రూ.6వేలు కేంద్రం ఇస్తుండగా.. ఏపీ ప్రభుత్వం మరో 14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తోంది.

మరోవైపు పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్నిసందర్శించి రైతులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పత్తి రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. పత్తి తేమ శాతం 18 ఉన్నా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారని మంత్రి వివరించారు. డిసెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో పత్తి కొనుగోళ్లు జరిగేలా చూస్తామని.. కొనుగోలు కేంద్రాలను పెంచాలని కేంద్రాన్ని కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని.. పత్తికి సరైన ధర రావాలంటే, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా తేమ శాతం ఉండాల్సిన ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన పత్తిని శుభ్రం చేసి, దూదిని వేరుచేసే జిన్నింగ్ యంత్రాల పనితీరును, ప్రక్రియను వివరంగా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా రైతులకు నష్టం కలగకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా అందేలా ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పిస్తున్నామన్నారు. పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వెంటనే అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవచ్చన్నారు.

తుఫాను హెచ్చరికలతో.. రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ద‌క్షిణ అండ‌మాన్ స‌ముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడ‌నం వాయుగుండంగా మారుతుందని.. రానున్న 48 గంట‌ల్లో తుఫాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతులు ధాన్యం కాపాడుకునేందుకు వీలుగా, ప్రభుత్వం తరపున ఉచితంగా పట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు జాగ్రత్తలు చెబుతారని.. దయచేసి వారి సూచనలను తప్పక పాటించాలన్నారు. సముద్రం అల‌జ‌డిగా మారుతున్నందున, మత్స్యకారులు వేట‌కు వెళ్లొద్దని సూచించారు. వేట‌కు వెళ్లిన వారు తక్షణమే వెనక్కు రావాలలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture Minister Kinjarapu Atchannaidu
  • andhra pradesh
  • Annadata Sukhibhava
  • AP Farmers

Related News

Sankranti Private Travels

Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర

  • Scrub Typhus

    Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?

  • Andhra Pradesh Logo

    Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

  • Haritha Hotel Srisailam

    Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్‌ ఫేక్?

  • Indian Skill Report 2026.

    Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

Latest News

  • Jagan – Lokesh : జగన్ కు లోకేష్ కు తేడా ఇదే..దటీజ్ లోకేష్ అన్న !!

  • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

  • Karthika Masam Effect: రికార్డు స్థాయిలో శ్రీశైల ఆలయానికి హుండీ ఆదాయం

  • Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

  • Mutual Funds : మీ టార్గెట్ రూ.10 కోట్లా? 25, 30, 35, 40..నెలకు ఎంత సిప్ చేయాలి?

Trending News

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd