HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A New Disease Is Terrorizing Uttarandhra

Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?

  • Author : Vamsi Chowdary Korata Date : 25-11-2025 - 10:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Scrub Typhus
Scrub Typhus

శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు రోజులకు పైగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాను స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వణిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మూడు మండలాల్లోని ఏడు గ్రామాల్లో ఒక్కొక్కరు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. దాశరథిపురం, కడుము, అక్రాపల్లి, అంబావల్లి గ్రామాలకు చెందిన వారికి ఈ వ్యాధి సోకింది. ఇందులో ఒక 9 నెలల శిశువు కూడా ఉంది.

స్క్రబ్‌ టైఫస్‌ లేదా బుష్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చిన్నపాటి లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం ద్వారా వస్తుంది. ఇలాంటి పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త, పనికిరాని మొక్కలు, తేమ, మురుగు ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ పురుగు ఉంటుంది. కాబట్టి.. అలాంటి ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. శీతకాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట- 2022లో కూడా లావేరు మండలం అప్పాపురం గ్రామస్థులకు కూడా ఈ వ్యాధి సోకింది. అనంతరం అధికారులు రంగంలోకి దిగి.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో.. ఈ స్క్రబ్ టైఫస్ నియంత్రణలోకి వచ్చింది.

లార్వల్ మైట్స్ పురుగులు కుట్టిన ప్రదేశంలో నల్లగా అవుతుంది. చర్మం ఎరుపెక్కి చిన్నపాటి దద్దుర్లు వస్తాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకితే.. దగ్గు, జ్వరం, జలుబు, నీరసం, కీళ్ల, తలనొప్పులతో బాధపడతారు. శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే జ్వరం తీవ్రమవడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు, పచ్చకామెర్లు, రక్తం గడ్డకట్టడం, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు, మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధి రాకుండా ఉండాలంటే.. ముందుగా లార్వల్ మైట్స్ పురుగులను దగ్గరికి రానివ్వొద్దు. అందుకోసం చెత్త పేరుకుపోకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పొడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తడిసిన దుస్తులు వేసుకోవవద్దు. కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవాలి. పొలాల్లో పనిచేసేటప్పుడైనా, ఇంట్లో ఉన్న సమయంలోనైనా ఏదైనా పురుగు కుట్టినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ వ్వాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా.. చిన్న పురుగే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • larval mites
  • scrub typhus
  • Scrub Typhus Disease
  • scrub typhus symptoms
  • srikakulam

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd