HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Government They Dont Have To Pay Rs 10 Thousand Completely Free

Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

  • Author : Vamsi Chowdary Korata Date : 25-11-2025 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Logo
Andhra Pradesh Logo

దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్‌లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వైకల్య ధ్రువపత్రాల జారీకి నిర్వహిస్తున్న సదరం శిబిరాల్లో స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో వసూళ్ల వ్యవహారం బయటపడింది. కొందరు దళారులు దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. దివ్యాంగుల్ని మోసం చేస్తున్న ఈ చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. సదరం స్లాట్ల విషయంలో దళారులను నమ్మవద్దని.. వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దివ్యాంగులు నేరుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఉచితంగా సదరం శిబిరాల్లో స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దళారుల ప్రమేయం లేకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరింది.

వాస్తవానికి సదరం శిబిరాల ద్వారా వైకల్య ధ్రువపత్రాలు పొందడం పూర్తిగా ఉచితం. అయితే, కొందరు దళారులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో స్లాట్లు బుక్ చేసి, వాటిని సొంత జిల్లాకు బదిలీ చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు. ఇలా ఒక్కో దివ్యాంగుడి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో అధికారులు వెంటనే స్ంపదించారు. ‘స్లాట్ బుకింగ్, ట్రాన్స్‌ఫర్ కోసం దళారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. దళారులు/మధ్యవర్తుల ద్వారా బుక్ చేసినా, వారికి డబ్బులు ఇచ్చినా. మీ స్లాట్ బదిలీ జరగదు. అలాంటి వాటిని రద్దుచేస్తాము’ అని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయంలో దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలని.. దళారుల్న నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం సూచించింది.

118 ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు ఈ నెల 14న విడుదలైన 31,500 స్లాట్లు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైకల్య నిర్ధారణ శిబిరాల స్లాట్లు వేగంగా బుక్ అవ్వడం, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. దివ్యాంగులు తమకు కావాల్సిన ఆసుపత్రికి స్లాట్ బదిలీ చేసుకోవడానికి పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో అభ్యర్థన పెట్టుకోవాలి.

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్‌లో, డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలోనూ లిఖితపూర్వకంగా అభ్యర్థన ఇవ్వొచ్చు. ప్రస్తుతం స్లాట్ బుక్ అయిన ఆసుపత్రి అధికారిక మెయిల్ ద్వారా కూడా రిక్వెస్ట్ పంపవచ్చు. ఈ పద్ధతుల్లో ఏదో ఒక దాని ద్వారా అభ్యర్థన పెట్టుకుంటే, దివ్యాంగులు కోరిన ఆసుపత్రికి స్లాట్ ట్రాన్స్‌ఫర్ ఉచితంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఏదైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • sadarem slot booking

Related News

CM Chandrababu participated in the parliamentary committees workshop

పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

  • India Republic Day

    రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Latest News

  • ఫేమస్ యాక్టర్ కు షాక్ ఇచ్చిన మెట్రో అధికారులు

  • Medaram Jathara : మేడారం వనదేవతల జాతరకు వేళాయె

  • కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • హైదరాబాద్‌లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం

  • భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి

Trending News

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

    • ఆర్జే మహవష్‌తో విడిపోయిన చాహ‌ల్‌.. కార‌ణం ఏంటంటే?

    • India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd